శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 23, 2021 , 01:34:41

బీజేపీకి మహిళలు బుద్ధి చెబుతారు..

బీజేపీకి మహిళలు బుద్ధి చెబుతారు..

  • ఐసీడీఏస్‌ రీజినల్‌ ఆర్గనైజర్‌ శరణ్యారెడ్డి

నల్లగొండ రూరల్‌, జనవరి 22 : సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే బీజేపీకి మహిళలు తగిన బుద్ధి చెబుతారని ఐసీడీఎస్‌ రీజినల్‌ ఆర్గనైజర్‌ మాలె శరణ్యారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. సాగర్‌ ఉపఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.  సమావేశంలో వనపర్తి జ్యోతి, సింగం లక్ష్మి, సుంకు ధనలక్ష్మి, మామిడి పద్మ, బొబ్బలి స్వరూపారెడ్డి, సంధ్య, లలిత, సుమతి పాల్గొన్నారు.

VIDEOS

logo