ఉద్యమ అడుగుల నుంచి ప్రగతి పరుగుల దాకా...

- సాగర్‌లో సీఎం కేసీఆర్ సభకు సన్నాహకాలు
- ఈ నెల 27 లేదా 28న సభకు అవకాశం
- 14వ మైలురాయి సమీపంలో స్థల పరిశీలన
- శిథిలమైన కాల్వలు...
- నిర్వహణ పట్టని ఎత్తి
- పోతలు.. నీళ్లందక బీళ్లుగా మారిన చివరి భూములు.. ప్రతి సీజన్లోనూ సాగర్ నీటి
- విడుదల కోసం రైతుల పోరాటాలు.. ఉమ్మడి రాష్ట్రంలో ఎడమ కాల్వ కింద ఇలా ఎన్నో
సమస్యలు. ఆయకట్టు రైతాంగం గోస చూసి చలించిన కేసీఆర్ ఉద్యమ నేతగా 2003లోనే కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశారు. స్వరాష్ట్రంలో సీఎంగా.. ఆ సమస్యలన్నింటికీ చరమ గీతం పాడారు. మరోవైపు ఉమ్మడి జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు, బీబీనగర్‌లో ఎయిమ్స్, కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు, గ్రామపంచాయతీల ఏర్పాటుతో పాలనను చేరువ చేయడంతోపాటు ప్రగతిని పరుగులు పెట్టించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరున్నర ఏండ్లుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ఇంకా చేపట్టాల్సిన పనులపై స్పష్టత ఇచ్చేందుకు నాగార్జునసాగర్ వేదికగా భారీ బహిరంగ సభకు సన్నాహకాలు జరుగుతున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, జనవరి21 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలతోపాటు బీబీనగర్‌లో ఎయిమ్స్ సాధన, కొత్త జిల్లాలు, మండలాలు, తండాలు గ్రామపంచాయతీలుగా ఏర్పాటు లాంటి విప్లవాత్మక మార్పులకు స్వరాష్ట్రం వేదికగా నిలిచింది. వీటికితోడు ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతున్నది. జిల్లా వెనుకబాటుతనానికి ఉద్యమ సమయంలో గుర్తించిన కారణాలను ఒక్కొక్కటిగా విశ్లేషిస్తూ.. వాటిని సరిచేస్తూ సమగ్రాభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరున్నరేండ్లుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంకా చేపట్టాల్సిన పనులపై స్పష్టత ఇచ్చేందుకు భారీ సభకు జిల్లాలో సన్నాహకాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న బహిరంగసభను నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో సభకు విశాలమైన స్థలాన్ని వెతికే పని ముమ్మరంగా సాగుతున్నది. హాలియా నుంచి పెద్దవూర రోడ్డులో ఓ స్థలాన్ని, 14వ మైలు రాయి నుంచి నల్లగొండ రోడ్డులో మరో స్థలాన్ని ప్రాథమికంగా గుర్తించారు. వీటిలో సభకు వచ్చే జనానికి అనుగుణంగా వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది లేని స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సభ సజావుగా సాగేందుకు కావాల్సిన వసతులు, స్థలం, హెలిప్యాడ్ ఏర్పాటు లాంటి వాటిపై సమీక్షించారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 27 లేదా 28న సీఎం సభ ఉండవచ్చని తెలుస్తున్నది. సభ షెడ్యూల్‌పై నేడో రేపో పూర్తి స్పష్టత రానుంది. ముందుగా ఈ నెల 22 లేదా 23వ తేదీల్లో ఏదో ఒక రోజు సభ నిర్వహించాలని భావించారు. ఇదే సమయంలో జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉండగా, సాగర్ ఆయకట్టులో రైతాంగం ఇంకా వరినాట్ల పనుల్లో బిజీగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అందరికీ అనుగుణంగా ఉండేలా సభ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు సమాలోచనలు చేస్తున్నారు. సభ ఎప్పుడున్నా అందుకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నేతలు దృష్టి సారించారు. మరోవైపు సీఎం సభ కావడంతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమై తగు చర్యలపై దృష్టి సారించింది.
బుద్ధవనం ప్రాజెక్టుతోపాటు..
సీఎం కేసీఆర్ సభ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. దేశానికి తలమానికం లాంటి బుద్ధవనం ప్రాజెక్టులో ఫేజ్ 1 ప్రధాన పనులు పూర్తయ్యాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తూ నిరంతరం సమీక్షించింది. బుద్ధవనం ప్రాజెక్టును కూడా ఈ సందర్భంగా ప్రారంభించాలని స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. దీంతోపాటు సాగర్ నియోజకవర్గంలో ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన నెల్లికల్, కుంకుడుచెట్టుతండా లిఫ్టులతోపాటు డిగ్రీ కాలేజీకి పునాదిరాళ్లు వేసే అవకాశం ఉంది. ఇంకా ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రధానమైన సమస్యలకు ఈ సభ ద్వారా సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నట్లు తెలుస్తోంది. వీటిపై సీఎం సభ షెడ్యూల్ నిర్ధారణ అయ్యాక పూర్తి స్థాయి స్పష్టత రానుంది.
సీఎం సభకు స్థల పరిశీలన
హాలియా, జనవరి21 : ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహణ కోసం గురువారం అనుముల మండలం అలీనగర్ వద్ద నల్లగొండకు వెళ్లే రహదారిలో డీఐజీ రంగనాథ్ స్థలాన్ని పరిశీలించారు. సభ సజావుగా సాగేందుకు కావాల్సిన వసతులు, స్థలం, హెలిప్యాడ్ ఏర్పాటు లాంటి వాటిపై సమీక్షించారు. ఆయన వెంట జిల్లా ఎస్బీ డీఎస్పీ రమణారెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు, హాలియా సీఐ వీర రాఘవులు, ఎస్ఐ శివకుమార్ ఉన్నారు.
తాజావార్తలు
- అందమైన భార్య పక్కనుండగా.. డిప్రెషనా..? కోహ్లీకి ఇంజినీర్ చురకలు
- హిట్ సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని
- ప్రయాగ్‌రాజ్-బిలాస్పూర్ మధ్య రేపు విమాన సర్వీసు ప్రారంభం
- హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్
- ఆ నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట: ప్రధాని
- రామన్ ఎఫెక్ట్‌కు 93 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
- ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్