సోమవారం 08 మార్చి 2021
Nalgonda - Jan 21, 2021 , 01:26:31

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

  • రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణలో డీఐజీ రంగనాథ్‌

నీలగిరి, జనవరి 20 : జిల్లాలో రోడ్డు ప్రమాదాల  నివారణే లక్ష్యంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని డీఐజీ, ఎస్పీ రంగనాథ్‌ అన్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్‌, ఫ్లెక్సీలను బుధవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించాలని, కారు నడిపినప్పుడు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ప్రతి వాహనానికి నంబర్‌ ప్లేట్‌ అమర్చుకోవాలని, నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలపై  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కార్యక్రమంలో ఏఎస్పీ నర్మద, డీటీఆర్‌బీ స్పెషల్‌ అఫీసర్‌ అంజయ్య, ఆర్‌ఐ నర్సింహాచారి, ట్రాఫిక్‌ సీఐ దుబ్బ అనిల్‌, ఐటీసెల్‌ సీఐ గోపి, పోలీస్‌ అధికారులు సంఘం నాయకులు జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo