సర్కారు ఎజెండా..

- సకల జనుల సంక్షేమమే
- మార్చిలోగా 50వేల ఉద్యోగాలు భర్తీ
- యాదాద్రి పవర్ ప్లాంట్‌తో అనేక మందికి ఉపాధి
- నిధులు, నియామకాల్లో వివక్షకు
- తెలంగాణ సర్కారుతో చెక్
- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సకల జనుల సంక్షేమమే ఎజెండాగా టీఆర్ఎస్ సర్కారు ముందుకుసాగుతున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పరిపాలన చేస్తున్నారని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో బుధవారం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమైక్య పాలనలో నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాలకు తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ చెక్ పెట్టారన్నారు. సాగర్ ఎడమ కాల్వకు ఆరేండ్లపాటు వరుసగా నీళ్లిచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మార్చిలోపు రాష్ట్రంలో 50వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేంందర్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు పాల్గొన్నారు.
- మిర్యాలగూడ, జనవరి 20
- ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- మిర్యాలగూడలో ‘పట్టభద్రుల’ ఎన్నికల సన్నాహక సమావేశం
మిర్యాలగూడ, జనవరి 20 : రాష్ట్రంలో సకల జనుల సంక్షేమమే ఎజెండాగా సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని టీఎన్ఆర్, ఎస్వీ గార్డెన్స్ ఫంక్షన్ హాళ్లలో జరిగిన మిర్యాలగూడ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి పాలనలో నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా ఎడమ కాల్వ ఆయకట్టుకు సాగు నీరు వదిలి రైతులకు అండగా నిలిచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. వృద్ధాప్య పింఛన్‌ను రూ.2వేలకు పెంచి వారి జీవితాలకు భరోసా కల్పించారని పేర్కొన్నారు. ఆడబిడ్డల వివాహాలకు రూ.1,00,116 అందించి పేద కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్రంలో 8లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని స్పష్టం చేశారు. ఆరేళ్లలో 1.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈ మార్చిలోపు మరో 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు పట్టభద్రులు సహకరించాలని కోరారు. ఎంపీ బడుగుల మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలన్నారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితోనే నేడు నియోజకవర్గంలో దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఇది పూర్తయితే వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలన స్వర్ణయుగం లాంటిదని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఏఎంసీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, రైతబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచంద్రునాయక్, జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, నూకల సరళాహనుమంతరెడ్డి, నందిని, కుర్ర కోటేశ్వర్రావు, గెల్లు శ్రీనివాస్, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, మోషిన్అలీ, నాగార్జునాచారి, స్కైలాబ్‌నాయక్, రంగారెడ్డి, యూసూఫ్, షహనాజ్ బేగం, కరుణాకర్‌రెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
మార్నింగ్ వాక్..
మిర్యాలగూడ టౌన్, జనవరి 20 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటువేసి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్నింగ్ వాకర్స్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి చేస్తున్న కృషిని వివరించారు. ఆయన వెంట ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఉదయ్‌భాస్కర్, పశ్యా శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
తాజావార్తలు
- డిజిటల్ వార్: గూగుల్+ఫేస్‌బుక్‌తో రిలయన్స్ జట్టు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్‌తో భవనం కూల్చివేత
- ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
- బార్బర్‌గా మారిన ప్రిన్సిపాల్.. విద్యార్థి హెయిర్‌కట్ సరిచేసిన వైనం
- మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్‌రెడ్డికే
- సామాన్యుడి చెంతకు న్యాయవ్యవస్థను తేవాలి : వెంకయ్యనాయుడు
- కాయిర్ బోర్డ్ సభ్యుడిగా టిఫ్ జాయింట్ సెక్రటరీ గోపాల్‌రావు
- వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- 87 లక్షలు పెట్టి ఇల్లు కొని.. భారీ సొరంగం తవ్వి.. వెండి చోరీ
- ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామాకు సిద్ధం