బడి.. రెడీ!

- పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న విద్యాసంస్థలు
- క్లీనింగ్ పనిలో సిబ్బంది
- ఎన్ఓసీ ఉంటేనే
- విద్యార్థులకు పర్మిషన్
- కొన్నిచోట్ల ఇప్పటికే యూనిఫామ్ అందజేత
- కరోనా నేపథ్యంలో మూతపడిన
పాఠశాలలు ఫిబ్రవరి 1నుంచి పునఃప్రారంభం కానున్నాయి. 9, 10 ఆపై తరగతుల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లను సిద్ధం చేస్తున్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. తరగతి గదులతోపాటు హాస్టళ్లు , వంట గదులు, వంటకు అవసరమైన సామగ్రిని శానిటైజేషన్ చేస్తున్నారు.
విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్.. పాఠశాలలు, కళాశాలలకు హాజరయ్యే
విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించాలే, భోజనం, తాగునీటి ప్రదేశాల్లో విధిగా చేతులు కడుక్కునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టాయిలెట్ల వద్ద, ఆవరణలో గుంపులుగా లేకుండా చూడనున్నారు. దీనిపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. జలుబు, దగ్గు ఉంటే ఇంటికి పంపించనున్నారు. అన్ని విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా ఒక ఐసొలేషన్ గదిని అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను విధిగా పాటించేలా చూడనున్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఒక్కో గదికి 20మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో స్కూళ్లు.. కళాశాలలు ఇవే ..
ఉమ్మడి నల్లగొండలో 9, 10తరగతి నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,185 ఉన్నాయి. (వీటిలో నల్లగొండ జిల్లాలో 512, సూర్యాపేట 379, యాదాద్రి భువనగిరిలో 294 ఉన్నాయి). జూనియర్ కళాశాలలు 244 (నల్లగొండ 118, సూర్యాపేట 78, యాదాద్రి భువనగిరి 28). డిగ్రీ కళాశాలు 91( నల్లగొండ 41, సూర్యాపేట 26, యాదాద్రిభువనగిరి 24). ఎంజీ యూనివర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అండ్ ఎంబీఏ, ఇంజనీరింగ్ కళాశాలు ఉండగా వీటిలో 1.46 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది.
పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు..
2020-21 వార్షిక పరీక్షలను ఎలా నిర్వహించాలి, సిలబస్ పూర్తి అనే అంశాలను పరిశీలిస్తూ ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చివరిసంవత్సరం విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది. వీటిని నిర్వహణకు ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు సమాచారం.
పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం సిద్ధం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలతో విద్యా సంవత్సరం నష్టపోకుండా ముందుగానే పాఠ్యపుస్తకాలను విద్యాశాఖ అందజేసిన విషయం విదితమే. ఇక ప్రతి విద్యార్థికి రెండు జతల స్కూల్ యూనిఫాం సిద్ధం చేశారు. కొన్ని మండలాల్లో కొంత మంది విద్యార్థులకు ఒక జత యూనిఫాం ఇచ్చినట్లు సమాచారం. విద్యార్థి ఫిబ్రవరి 1న బడికి రాగానే వీటిని అందించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం..
కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నాం. దీనిపై ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 25లోగా పూర్తి చేయాలని సూచించాం. పాఠశాలల నిర్వహణ, నిబంధనలపై ఇప్పటికే తెలియచేశాం. అదే స్థాయిలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బందికి అవగాహన కల్పించాం.
- బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
సిద్ధం చేస్తున్నాం
విద్యార్థుల రాకకు సిద్ధం చేస్తున్నాం. మా ఉపాధ్యాయులతో కలిసి సిబ్బందికి అవగాహన కల్పించాం. అన్ని తరగతి గదులను శానిటైజేషన్ చేసి ఫర్నిచర్‌ను తుడిపించాం. మూత్రశాలలు, మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణను శుభ్రం చేయిస్తున్నాం. కొవిడ్ నిబంధనలను పాటించాలని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాం. తల్లిదండ్రులను నుంచి ఎన్ఓసీని తీసుకుంటాం.
- మారోజు పుష్పలత, హెచ్ఎం, ఫ్రభుత్వ బాలికల పాఠశాల, నల్లగొండ
తాజావార్తలు
- విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
- వైరల్ వీడియో : ఆవు క్యాట్ వాక్
- ఆటోపైనే ఇళ్లు.. ఆనంద్ మహీంద్రా ఫిదా..!
- ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు
- సెంచరీతో సెలక్టర్లను ఆకర్శించిన దేవ్‌దత్
- దేవ్రీ ఆలయంలో పూజలు చేసిన ధోనీ
- సందీప్ కిషన్ నా ఫోన్ కాల్ ఎత్తాలంటే భయపడ్డాడు
- చిన్నారుల విద్యకు సోనూ సూద్‌తో చేతులు కలిపిన ఎంఐ మొబైల్స్
- మొలకలు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది
- బౌద్ధమతం ప్రపంచ శాంతికి ప్రతీక