ఆదివారం 07 మార్చి 2021
Nalgonda - Jan 20, 2021 , 01:08:35

డీసీసీబీ టర్నోవర్‌ రూ.1350 కోట్లు

డీసీసీబీ టర్నోవర్‌ రూ.1350 కోట్లు

  • బ్యాంకు చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి

నల్లగొండ, జనవరి 19 : ఈ వానకాలం సీజన్‌తో సహకార బ్యాంక్‌ టర్నోవర్‌ రూ. 1000 నుంచి రూ.1350 కోట్లకు పెరిగిందని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి  తెలిపారు. డీసీసీబీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఆ శాఖ మేనేజర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి సహకార సొసైటీలో సభ్యులుగా ఉన్న రైతులందరికీ పంట రుణాలు అందజేయనున్నట్లు చెప్పారు. అందుకు రూ. 50 కోట్లు మంజూరయ్యాయని త్వరలో అన్ని సొసైటీలకు ఈ నిధులు విడుదల చేస్తామన్నారు. వాటిని పెట్టుబడి కోసం అర్హులైన రైతులందరికీ అందజేయాలన్నారు. అదే విధంగా బహుళార్ధక ప్రాజెక్టు కింద విడుదలైన నిధులను గుర్తించిన 15 సొసైటీలకు ఇస్తామని వాటితో ఆయా సొసైటీల పరిధిలో గోదాముల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.  ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలను పూర్తి స్థాయిలో రికవరీ చేయాలని,  డిపాజిట్లు కూడా భారీగా పెంచాలని సూచించారు. ప్రతి సొసైటీకి సొంత నిధులు ఉంటేనే ఎక్కువ లాభాలు వస్తాయనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.  సమావేశంలో సీఈఓ మదన్‌మోహన్‌, డీఆర్‌ గోలి శ్రీనివాస్‌, డీజీఎం కురువా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo