శుక్రవారం 05 మార్చి 2021
Nalgonda - Jan 18, 2021 , 00:41:09

కార్లు.. బారులు

కార్లు.. బారులు

కేతేపల్లి, జనవరి 17 : సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుంచి తమ సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగు పయనమయ్యారు. దీంతో ఆదివారం 65 నంబర్‌ జాతీయ రహదారిపై కార్లు బారులు దీరాయి. మధ్యాహ్నం వరకు రద్దీ సాధారణంగానే ఉన్నా సాయంత్రం భారీగా పెరిగింది. హైవేపై జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు బారికేడ్లు ఏర్పాటు చేయగా.. కేవలం ఒక వాహనమే వెళ్లేలా ఉండడంతో కిలోమీటరు వరకు కార్లు బారులు దీరాయి. కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్‌ వైపు వెళ్లేందుకు 6 కౌంటర్లను తెరిచారు. ఎస్‌ఐ బి.రామకృష్ణగౌడ్‌ ట్రాఫిక్‌ నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు.  

VIDEOS

logo