మంగళవారం 09 మార్చి 2021
Nalgonda - Jan 18, 2021 , 00:39:05

బుద్ధవనాన్ని సందర్శించిన సమాచార కమిషనర్‌

బుద్ధవనాన్ని సందర్శించిన సమాచార కమిషనర్‌

నందికొండ, జనవరి 17 : రాష్ట్ర సమాచారహక్కు చట్టం కమిషనర్‌ కట్టా శేఖర్‌రెడ్డి ఆదివారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. బుద్ధచరిత వనం, జాతకపార్కు, ధ్యానవనం, స్థూపపార్కులను సందర్శించారు. అష్టబుద్ధ నిలయంలో ధ్యానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బుద్ధవనం ప్రాజెక్టు ద్వారా గౌతమ బుద్ధుడి జీవిత చరిత్ర, బౌద్ధ మతం విలువలు ప్రపంచానికి తెలుస్తాయన్నారు. అనంతరం నాగార్జునసాగర్‌ డ్యాం, అనుపులోని బౌద్ధ విశ్వవిద్యాలయం, ఎత్తిపోతల జలపాతాలను సందర్శించారు. ఆయన వెంట టూరిజం గైడ్‌ సత్యనారాయణ, డిప్యూటీ తాసీల్దార్‌ శరత్‌చంద్ర, వీఆర్వో నిరంజన్‌ తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo