నాలుగు లిఫ్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

- ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
దేవరకొండ/చందంపేట, జనవరి 17 : దేవరకొండ నియోజకవర్గంలో నాలుగు ఎత్తిపొతల పథకాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సూచించారు. ఆదివారం చందంపేట మండలంలోని పొగిళ్ల సమీపంలో గవ్వలసరి ప్రాంతాన్ని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నేరేడుగొమ్ము మండలంలోని పెద్దమునిగల్ ప్రాంతంలో అంబాభవానీ లిఫ్టు, చందంపేట మండలం పొగిళ్ల సమీపంలో గవ్వలసరి, కంబాలపల్లి వద్ద అడ్డగట్టు, పీఏపల్లి మండలంలోని పెద్దగట్టు లిఫ్టులను మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. లిఫ్టులు పూర్తయితే సుమారు 60వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు శనివారం సీఎం కేసీఆర్ తనకు ఫోన్‌చేసి 4నాలుగు లిఫ్టుల ప్రతిపాదనలను తీసుకురావాలని సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంజూరైన లిఫ్ట్‌లతోపాటు దేవరకొండ నియోజకవర్గంలోని నాలుగు లిఫ్టులను మంజూరు చేసి హాలియాలో ముఖ్యమంత్రి సభ పెట్టనున్నట్లు చెప్పారు. అదే రోజు లిఫ్టులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. పొగిళ్ల ప్రాంతంలో గవ్వలసరి లిఫ్టు కింద 6 వేల ఎకరాలకు, అంబాభవానీ లిఫ్టు కింద 15వేల ఎకరాలకు, కంబాలపల్లి పరిధిలోని అడ్డగట్టు లిఫ్టు కింద 15 వేల ఎకరాలకు, పీఏపల్లి మండలంలోని పెద్దగట్టు లిఫ్టు కింద మరో 15వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమానికి కార్యక్రమాల్లో ఐడీసీ, ఐఎల్‌ఐఎస్ శాఖ అధికారులు సంతోశ్‌కుమార్, మనోహర్, అప్పారావు, ఫయాజ్, జడ్పీటీసీలు పవిత్ర, బాలూనాయక్, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, ఆర్డీఓ గోపీరామ్, తాసీల్దార్లు వెంకటేశ్వర్లు, సురేందర్‌రెడ్డి, నాయకులు తిరుపతయ్య, బిక్కునాయక్, గోవింద్‌యాదవ్, మల్లేశ్‌యాదవ్, హన్మానాయక్, రాములు, బాలు, లక్ష్మానాయక్, వెంకటయ్య, రవీందర్‌నాయక్, కృష్ణయ్య, వెంకటేశ్‌గౌడ్, సురేశ్‌గౌడ్, రాజు, కృష్ణ పాల్గొన్నారు.
నేడు సన్నాహక సమావేశాలు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాలను సోమవారం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తెలిపారు. దేవరకొండ, చందంపేట, నేరేడుగొమ్ము, డిండి, మండలాల వారికి వైష్ణవి ఫంక్షన్హాల్లో ఉదయం 11గంటలకు, చింతపల్లి, పీఏపల్లి, కొండమల్లేపల్లి మండలాల వారికి కేఎంఆర్ ఫంక్షన్హాల్లో మధ్యాహ్నం 2గంటలకు జరుగనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు హాజరుకానున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..
- పోలింగ్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు
- వాణీదేవిలోనే పీవీని చూస్తున్నాం..