మంగళవారం 02 మార్చి 2021
Nalgonda - Jan 18, 2021 , 00:25:59

క్రీడలతో మానసిక ప్రశాంతత

క్రీడలతో మానసిక ప్రశాంతత

  • డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి 
  • రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం

నల్లగొండ రూరల్‌, జనవరి 17 : క్రీడలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్ది అన్నారు. ఆదివారం స్థానిక మేకల అభినవ్‌ స్టేడియంలో 7వ రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సారంగపాణి, జిల్లా అధ్యక్షుడు మాచర్ల జగ్జీవన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. చిన్నతనం నుంచే క్రీడలను అలవర్చుకుంటే శారీరక ధారుడ్యం పెంపొందించుకోవచ్చన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు పథకాలు అందజేశారు. డీఎస్‌డీఓ మక్బూల్‌ ఆహ్మద్‌ మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు వచ్చే నెల 25 నుంచి 27వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 230మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ నాగదుర్గాప్రసాద్‌, సురేశ్‌బాబు, శంభులింగం, కోచ్‌లు, పీఈటీలు పాల్గొన్నారు. 


VIDEOS

logo