సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Jan 17, 2021 , 03:00:49

యాదవుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి

యాదవుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి

  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నోముల భగత్‌

హాలియా, జనవరి 16 : రాష్ట్రంలోని యాదవుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని టీఆర్‌ ఎస్‌ రాష్ట్ర నాయకుడు నోముల భగత్‌ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమానికి నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి యాదవులు భారీగా తరలివెళ్లారు. వారి వాహనాలను భగత్‌ హాలియాలో జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, హాలియా, తిరుమలగిరిసాగర్‌ మండలాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, నాయకులు కూరాకుల అంతయ్య, వెంపటి శంకరయ్య, కట్టెబోయిన గురువయ్య, బొల్లం రవి, రాం అంజయ్యయాదవ్‌, నల్లబోతు వెంకటయ్య, కె. గోవర్ధన్‌, పిల్లి అభినయ్‌, రాముయాదవ్‌, ప్రసాద్‌నాయక్‌, శ్రీను పాల్గొన్నారు.

VIDEOS

logo