మన శాస్త్రవేత్తల కృషితోనే వ్యాక్సిన్ : గుత్తా

నీలగిరి జనవరి16 : మన దేశ మేధస్సు, శాస్త్రవేత్తల కృషితో ప్రపంచం ఆశ్చర్యపడేలా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుక్కోగలిగామని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా జనరల్ దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో తెలంగాణ ముందుందని, రాష్ట్రంలోని బయోటెక్, సీరమ్ సంస్థలు దేశంలో మొదటిస్ధానంలో ఉన్నాయని అన్నారు. కరోనాతో ప్రజలంతా భయానకంగా గడిపారని, సీఎం కేసీఆర్ ముందు చూపుతో మహమ్మారి నుంచి రాష్ర్టాన్ని కాపాడుకోగలిగామని చెప్పారు. కుటుంబ సంక్షేమ శాఖ జేడీ రజినీ, అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, ట్రైనీ కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఎంహెచ్ఓ కొండల్రావు, దవాఖాన సూపరింటెండెంట్ నర్సింహ, డిప్యూటీ డీఎంహెచ్ఓ అరుంధతి, పోగ్రాం అధికారులు కళ్యాణ చక్రవర్తి, హరికృష్ణ, రాంమోహన్, వేణుగోపాల్‌రెడ్డి, మహేశ్వరం కృష్ణయ్య, గోవింద్ నాయక్, శేఖర్‌రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్, డాక్టర్లు రమేశ్ పాల్గొన్నారు.
ఎప్పటికీ గుర్తుండి పోతుంది
ప్రపంచాన్ని గడగడలాండించిన కరోనా వైరస్ అంతమెందించే టీకాను వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో మందికి ఇంజక్షన్లు వేశాను. కానీ కరోనా టీకా వేసిన నాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంది. మొదటి టీకా వేసే అదృష్టం నాకు దక్కినందుకు గర్వపడుతున్నా.
- ఎస్.లూర్దుమేరీ, స్టాఫ్ నర్సు, పీపీ యూనిట్, నల్లగొండ (వ్యాక్సిన్ వేసిన వ్యక్తి)
దేశానికే గర్వకారణం
మన దేశ శాస్త్రవేత్తల కృషితో స్వల్ప కాలంలోనే కరోనా వ్యాక్సిన్ వచ్చింది. ఇది అందరికీ గర్వకారణం. మొదటి సారి గా కరోనా వారియర్స్‌కు టీకా ఇవ్వడం అందులో నేనుండటం చాలా ఆనందంగా ఉంది.
- శ్రీనివాస్‌నాయక్, ఆర్ఎంఓ, మిర్యాలగూడ ఏరియా దవాఖాన
జీవితంలో మరిచిపోలేను
కరోనా వ్యాక్సిన్‌ను నా చేతుల మీదుగా వేయటాన్ని జీవితంలో మర్చిపోలేను. నేను 2003 నుంచి ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నా. 2004లో హెపటైటిస్, 2009లో మెదడువాపు నివారణ, 2016లో యాంటీ పోలియో నివారణ, 2019లో రోటా వైరస్ నివారణ టీకాలు వేశాం. కానీ ఇప్పుడు కొవిడ్ టీకా వేసినపుడు ఎంతో సంతోషం కలిగింది.
తాజావార్తలు
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్‌కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా