నేడే కొవిడ్ టీకా

- వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి
- తొలిరోజు ఒక్కో సెంటర్లో 30 మందికి..
- విజయవంతం చేయాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి
- కొవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నల్లగొండ జిల్లాలో నాలుగు, సూర్యాపేట జిల్లాలో మూడు కేంద్రాలను సిద్ధం చేయగా శనివారం ఒక్కో సెంటర్లో 30 మందికి టీకా వేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి కాగానే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నల్లగొండలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొననున్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా అధికారులతో మంత్రి సమావేశమై టీకా వందశాతం సురక్షితమని, వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలని సూచించారు. ఇక వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని, అన్ని జాగ్రత్తలతో టీకా వేసేందుకు సిద్ధం చేశామని వైద్యాధికారులు తెలిపారు.
నేడే కొవిడ్ వ్యాక్సిన్
కొవిడ్ వ్యాక్సినేషన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని ఏడు కేంద్రాల్లో మొత్తం 210మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ ప్రారంభోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి ప్రసంగం పూర్తికాగానే ఉదయం 10.30గంటలకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ మేరకు నల్లగొండ జిల్లాకు 128వాయిల్స్, సూర్యాపేట జిల్లాకు 47వాయిల్స్ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం చేసేలా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నల్లగొండ జిల్లాకేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు.
జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ మాక్‌డ్రిల్ విజయవంతంగా పూర్తయ్యింది. నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ సిబ్బంది 8884మందిని గుర్తించారు. వీరిలో 408మంది వైద్యులు, సూపరింటెండెంట్లు, 469మంది సిబ్బంది, 383మంది పారామెడికల్ సిబ్బంది, 412మంది ఏఎన్ఎంలు, నర్సింగ్ స్టాప్, నర్సులు 511, క్లరికల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది 93,150మంది మెడికల్ విద్యార్థులు, 3607మంది అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, 1982మంది ఆశ కార్యకర్తలు, మరో 869మంది డ్రైవర్లు ఇతరత్రా సిబ్బంది కలిపి మొత్తం 11036మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తొలిరోజున నాలుగు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభించి కేంద్రానికి 30మంది చొప్పున 120మందికి అందించనున్నారు. మిగిలిన 44కేంద్రాల్లో ఈ నెల 18న ప్రారంభించనున్నారు.
సోమవారం నుంచి అన్ని కేంద్రాల్లో...
జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి అన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. రోజుకు వంద మంది చొప్పున ఇస్తారు. శనివారం, బుధవారం వ్యాక్సినేషన్ రోజులు కావడంతో వాటిని, ప్రభుత్వ సెలవులను మినహాయించి (ఈ నెల 16,18,19,21,22,25,28,29 తేదీల్లో) వ్యాక్సినేషన్ పూర్తిచేయనున్నారు. తిరిగి వీరికే 14రోజుల అనంతరం రెండో విడుత వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
తాజావార్తలు
- నిరుద్యోగుల కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్
- రాష్ట్రంలో మూడురోజులు పొడి వాతావరణం.. పెరగనున్న ఎండలు
- నాణ్యమైన పరిశోధనలు జరగాలి: ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి
- బండ చెరువు నాలా పనులను జీహెచ్ఎంసీకి అప్పగించాలి
- రాజకీయ దురుద్దేశంతోనే ర్యాంకింగ్‌ను తగ్గించారు
- వృద్ధులకు గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే టీకాలు వేయాలి
- బీజేపీ ద్వంద్వ విధానాల్ని ఎండగట్టాలి
- అభివృద్ధి కావాలా..? అబద్ధాలు కావాలా..?
- తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు..
- అభివృద్ధిని చూసి ఎమ్మెల్సీలను గెలిపించాలి