మహిళా ఓటర్లే అధికం

- ఓటరు తుది జాబితా విడుదల
- చేసిన ఎన్నికల సంఘం
- నల్లగొండ జిల్లాలో13,54,487,
- సూర్యాపేటలో 9,27,092
- మంది ఓటర్లు
నల్లగొండ/సూర్యాపేట జనవరి 15 : 2021 ఓటరు తుది జాబితాను శుక్రవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులకు నూతనంగా ఓటు హక్కు కల్పించగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసిన అనంతరం విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో 13,54,487 మంది, సూర్యాపేటలో 9,27,092 మంది ఓటర్లకు గాను స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా దేవరకొండ నియోజకవర్గంలో, అత్యల్పంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఓటర్లు నమోదయ్యారు.ఓటరు జాబితా విడుదల
నల్లగొండ/సూర్యాపేట, జనవరి 15 : ఓటర్ తుది జాబితా 2021ను శుక్రవారం ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. 18సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పిండటంతో పాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు పూర్తి చేసి ముసాయిదా జాబితాను విడుదల చేశారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వారీగా పోలింగ్ కేంద్రాలతో పాటు తాసీల్దార్ కార్యాలయాల్లో ఉంచారు. 2021ముసాయిదా జాబితాలో భాగంగా గతేడాది నవంబర్‌లో జాబితా ప్రకటన తర్వాత జనవరి 1ని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు. నూతనంగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు మార్పులు, చేర్పుల అనంతరం తుది జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర పరిశీలకురాలు అనితా రాజేంద్ర నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీఓలు, ఎన్నికల అధికారులతో జాబితాపై సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆర్డీఓలు జగదీశ్వర్‌రెడ్డి, రోహిత్‌సింగ్, గోపీరాంనాయక్, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మాచారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు, ఎన్నికల డీటీ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
అత్యధికంగా దేవరకొండలో..
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 1354487మంది ఓటర్లు ఉండగా పురుషుల(675879) కంటే మహిళలు(678595) అధికంగా ఉన్నారు. ఆరు నియోజకవర్గాలో అత్యధికంగా దేవరకొండలో 233126మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 216983 మంది ఉన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 927092 మంది ఓటర్లు తేలగా, పురుషుల(458020)కంటే మహిళా ఓటర్లు (469055) అధికంగా ఉన్నారు.
తాజావార్తలు
- ఎవరీ పద్మశ్రీ.. దిల్ రాజు ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు..?
- మరింత తగ్గిన బంగారం ధరలు
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్‌కు రెడీ
- అందుకే పెద్ద సంఖ్యలో గురుకులాల స్థాపన
- .. ఆ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఉపసంహరణ
- ఒలింపిక్ జ్యోతిని చేపట్టనున్న శతాధిక వృద్ధురాలు!
- రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కర్ణాటక మంత్రి పూజలు
- ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రికి బదులు సోదరుడు హాజరు
- సీఎస్ సోమేశ్‌కుమార్‌తో ఈస్తోనియా అంబాసిడర్ భేటీ
- ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియాకు 89 పరుగుల లీడ్