బుధవారం 27 జనవరి 2021
Nalgonda - Jan 14, 2021 , 01:12:45

ప్రతి ఇంటాపండుగే...

ప్రతి ఇంటాపండుగే...

కలిసొచ్చే కాలానికిసంక్రాంతిటీకా రాకతో కరోనా పీడ విరుగడప్రభుత్వోద్యోగుల్లో పదోన్నతుల కోలాహలంవారంలోపే కారుణ్య నియామకాలుధరణి సేవలుఇక మరింత సులువుఎల్లుండి నుంచిసబ్సిడీ గొర్రెల పంపిణీజిల్లా ప్రజలకు మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలిచైర్మన్‌ గుత్తా శుభాకాంక్షలు. సంబురాల సంక్రాంతి సంతోషాలెన్నింటినో మోసుకొచ్చింది. నూతన వెలుగులకు ప్రతీకగా భావించే ప్రకృతి పండుగ శుభసూచకం పలుకుతున్నది. దాదాపు ఏడాది కష్టాలను చూసిన సమాజం కరోనాకు ముందు, తర్వాత అన్నట్టు తయారైన పరిస్థితులను భోగి మంటల్లోకి నెట్టేసింది. కొవిడ్‌ 19 టీకా బుధవారం నల్లగొండ జిల్లాకు చేరింది. 16న అధికార యంత్రాంగం వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టనున్నది. మరోవైపు శరవేగంగా సాగుతున్న పదోన్నతుల కసరత్తు పండుగ పూట ప్రభుత్వోద్యోగుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నది. రెండేండ్లకే ప్రమోషన్‌ నిర్ణయంతో వారికి పండుగ ఒకింత ముందే వచ్చినట్టు అయ్యింది. నాలుగైదు రోజుల్లోనే పలు కుటుంబాల్లో కారుణ్య నియామక వెలుగులు నిండనున్నాయి. రెవెన్యూలో నవ శకానికి నాంది పలుకుతూ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ పండుగ తర్వాత మరింత ఫ్రెండ్లీ యూజర్‌గా మారనున్నది. భూ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ఏర్పాటుచేసిన ట్రిబ్యునల్స్‌ సేవలూ అందుబాటులోకి రానున్నాయి. కరోనాతో నిలిచిపోయిన సబ్సిడీ గొర్రెల పంపిణీ నల్లగొండ వేదికగా శనివారం తిరిగి ప్రారంభం కానున్నది. కరోనాతో మూతపడిన విద్యాసంస్థలు 10 నెలల తర్వాత తెరుచుకోనున్నాయి. వానకాలం అతివృష్టితో ఇబ్బందిపడ్డ రైతులు తాజాగా సర్కారు పంట పెట్టుబడి సాయం అందుకుని కోటి ఆశలతో యాసంగి లక్ష్యంవైపు సాగుతున్నారు.

 నల్లగొండ ప్రతినిధి, జనవరి13(నమస్తే తెలంగాణ) అనేక విప్లవాత్మక మార్పులకు సంక్రాంతి పండుగ గీటురాయిగా నిలువనుంది. బుధవారం భోగి రోజున నల్లగొండకు కరోనా వ్యాక్సిన్‌ చేరింది. మకర సంక్రాంతి అనంతరం 16న వ్యాక్సినేషన్‌కు లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. 

ఉద్యోగోన్నతులు, నియామకాలు..

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంక్రాంతి సంబరాలను మోసుకొచ్చింది. ఉద్యోగోన్నతులకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. గతంలో ఉన్న మూడేళ్ల సర్వీసు నింబంధనను రెండేళ్లకు కుదించారు. ఫలితంగా జిల్లాలో కనీసం 2500మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగనుంది. విద్యాశాఖలో ఉమ్మడి జిల్లా వారీగా సీనియారిటీ ఫైల్‌ను సిద్ధం చేశారు. జడ్పీలో కారుణ్య నియామకాలను కూడా పూర్తి చేస్తున్నారు. పదోన్నతులు, కారుణ్య నియామకాల అనంతరం జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై స్పష్టత రానుంది. ఉద్యోగులు ఎదురు చూస్తున్న వేతన పెంపు పండుగ తర్వాత అందించేలా కార్యాచరణ కొనసాగుతోంది.

ధరణి పోర్టల్‌ మరింత సులభతరం

ధరణి పోర్టల్‌ను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ ప్రకటించింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే 10వేలకు పైగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు నిమిషాల్లో పూర్తయ్యాయి. ఈ విధానాన్ని మరింత సులభతరం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు కూడా జారీ చేశారు. కోర్టు కేసులున్నవి మినహా ఇతర భూసమస్యలను రానున్న రెండు నెలల్లో పరిష్కరించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.  

16నుంచి గొర్రెల పంపిణీ

వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా.. యాదవులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 16న నల్లగొండలోని బత్తాయి మార్కెట్‌ వేదికగా మంత్రులు కేటీఆర్‌, తలసాని, జగదీశ్‌రెడ్డి గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నారు. జిల్లాలో నిలిచిపోయిన 260యూనిట్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు.  

విద్యాసంస్థల ప్రారంభానికి కసరత్తు...

విద్యాసంస్థలు ఫిబ్రవరి1న తెరుచుకోనున్నాయి. 9నుంచి ఆపై తరగతులు బోధించేందుకు వీలుగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నెల 20న పూర్తి వివరాలతో ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. యాజమాన్యాలకు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా ఇది శుభవార్తే.  

యాసంగి సాగులో రైతులు బిజీ.. 

యాసంగి సాగుపై రైతులు దృష్టి సారించారు. ఇప్పటికే మెట్ట ప్రాంతాల్లో బోర్లు, బావుల కింద వరినాట్లు చివరి దశకు చేరగా, ఆయకట్టులో వరినాట్లు ముమ్మరమయ్యాయి. గోదావరి, కృష్ణాతో పాటు మూసీ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల కొనసాగుతున్నది. దీనికి తోడు సంక్రాంతి పండుగ నాటికి జిల్లాలోని రైతులందరికీ ఎకరానికి రూ.5వేల చొప్పున యాసంగి పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇప్పటికే రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమచేసింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి 6.50లక్షల మంది రైతులకు 800 కోట్ల రూపాయలకు పైగా నగదు వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ  చేసింది.


logo