వ్యాక్సిన్ వచ్చేసింది..

- భారీ భద్రతతో నల్లగొండ జిల్లా ఆస్పత్రికి 175 వాయిల్స్
- నేడు సెంట్రల్ డెస్క్స్టోర్ నుంచి మూడు ప్రాంతాలకు సరఫరా
- బందోబస్తు మధ్య జిల్లాకు చేరిన 128వాయిల్స్
నీలగిరి, జనవరి 13 : కొవిడ్ వ్యాక్సిన్ బుధవారం జిల్లాకు చేరింది. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన వ్యాక్సిన్ తీసుకు వచ్చేందుకు నల్లగొండ డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి పోలీసు బందోబస్తుతో ముగ్గురు ఫార్మాసిస్టులు, నలుగురు పోలీసు సిబ్బంది వెళ్లారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు సంబంధించిన వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిన అధికారులు డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నిమళ్ల కొండల్రావు పర్యవేక్షణలో జిల్లా జనరల్ దవాఖానలోని సెంట్రల్ డెస్క్ స్టోర్(సీడీఎస్)లో భద్రపర్చారు. జిల్లాలో మొత్తం 11036మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించగా మొదటి, రెండో విడుత కలిపి 22076 డోసులు అవసరం. ఒక్కో వాయిల్లో 10మందికి సరపడా డోసులు ఉండడంతో జిల్లాకు 175 వాయిల్స్ వచ్చాయి. ఈ నెల 16న జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో రెండు, మిర్యాలగూడ ఏరియా దవాఖాన, పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక్కో కేంద్రం ద్వారా 120మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నారు. మిగిలిన 44కేంద్రాల్లో ఈ నెల 18నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు. సీడీఎస్ నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాలకు చేరవేయడంతో పాటు వాటిని భద్రపరిచే బాధ్యతను డిప్యూటీ డీఎంహెచ్ఓలకు అప్పగించారు. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి 14రోజుల తరువాత రెండో డోస్ వేయనున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లోనే వ్యాక్సిన్...
కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నిమళ్ల కొండల్రావు తెలిపారు. బుధవారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ కామినేని బదులుగా పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్‌కు, మిర్యాలగూడ జ్యోతి దవాఖానకు బదులుగా ఏరియా దవాఖానకు మార్చినట్లు తెలిపారు. 18న మిగిలిన 44కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో సూపరింటెండెంట్లు హరికుమార్, ఏఆర్ డీఎస్పీ రమణారెడ్డి, సీఐ నిగిడాల సురేశ్, వైద్యారోగ్య సిబ్బంది మహేశ్వరం కృష్ణయ్య, గోవింద్ నాయక్, యూసుఫ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- బీజేపీ ఎమ్మెల్సీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
- బెంగాల్ సీఎం మమతతో భేటీ కానున్న తేజస్వి
- కామాఖ్య ఆలయాన్ని దర్శించిన ప్రియాంకా గాంధీ
- ఒక్క సంఘటనతో పరువు మొత్తం పోగొట్టుకున్న యూట్యూబ్ స్టార్
- ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
- నాలుగో టెస్ట్‌కూ అదే పిచ్ ఇవ్వండి
- ఆప్‌లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్
- తాటి ముంజ తిన్న రాహుల్ గాంధీ..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
- వెండితెరపై సందడి చేయనున్న బీజేపీ ఎమ్మేల్యే..!