శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 13, 2021 , 01:01:55

తక్కువ ధరకు బంగారమంటూ మోసం

తక్కువ ధరకు బంగారమంటూ మోసం

  • నిందితుల అరెస్టు

నీలగిరి, జవవరి12 : సినిమా కాస్టూమ్స్‌ కాంట్రాక్టు ఇప్పిస్తామని, తక్కువ ధరకే బం గారు బిస్కెట్లు ఇప్పిస్తామని చెప్పి రూ. 11 లక్షలు తీసుకొని మోసం చేసిన కేసులో నిందితులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వన్‌టౌన్‌ సీఐ నిగిడాల సురేశ్‌ తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన బీరెళ్లి సందీప్‌ అలియాస్‌ సందీప్‌కుమార్‌, గొట్టిముక్కల సురేశ్‌ స్నేహితులు. సందీప్‌ నల్లగొండ పట్టణంలోని శాంతినగర్‌లో ఉంటున్న తన చిన్నమ్మ ఇంటికి తరచూ వస్తుండేవాడు. ఇలా ఆమె ఇంటి పక్కనే ఉండి బట్టల వ్యాపారం చేస్తున్న సైదాకు పరిచయమయ్యాడు. సినిమాలో కాస్టూమ్స్‌ కాంట్రాక్టు ఇప్పిస్తానని, తన స్నేహితుడు సురేశ్‌ వద్ద నుంచి తక్కువ ధరకే బంగారు బిస్కట్లు ఇప్పిస్తానని ముందుగా రూ. 3.5లక్షలు, గుగూల్‌ పే ద్వారా మరో 8.63 లక్షలు తీసుకున్నాడు. తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో సైదా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. వారిపై కూకట్‌పల్లి, ఎస్‌ఆర్‌నగర్‌, ముషీరాబాద్‌, నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. 


VIDEOS

logo