సోమవారం 08 మార్చి 2021
Nalgonda - Jan 13, 2021 , 01:01:55

పల్లె ప్రగతి పనులను ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలి

పల్లె ప్రగతి పనులను ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలి

  •  కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్లగొండ రూరల్‌/ నల్లగొండ, జనవరి 12 : పల్లె ప్రగతిలో భాగంగా ఈజీఎస్‌  నిధులతో పంచాయతీరాజ్‌శాఖ ద్వారా చేపట్టిన పనులను ఫిబ్రవరి నెలాఖారులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీరాజ్‌ డీఈలు, ఏఈలు, ఏపీఓలు, కార్యదర్శులతో మాట్లాడారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వెనుకబడి ఉందని, నిర్లక్ష్యం వీడి పనులను వేగవంతం చేయాలని కోరారు. అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌(టీఏడీఏ) డైరీ, క్యాలెండర్‌ను కలెక్టర్‌ తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఆ సంఘం చైర్మన్‌, ఏడీఏ సుధారాణి, అధ్యక్షుడు నూతన్‌కుమార్‌, కళ్యాణ చక్రవర్తి, కీర్తి, సైదా, సభ్యులు పాల్గొన్నారు.

VIDEOS

logo