శుక్రవారం 05 మార్చి 2021
Nalgonda - Jan 13, 2021 , 01:01:54

వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌

వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌

నీలగిరి, జవనరి12 : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ఈనెల 16న జిల్లాలోని మూడు ప్రాంతాల్లో ప్రారంభించనున్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ తెలిపారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మెడికల్‌ ఆఫీసర్లు, వైద్యారోగ్యశాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని జనరల్‌ దవాఖాన, నార్కట్‌పల్లిలోని కామినేని, మిర్యాలగూడలోని జ్యోతి దవాఖానలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల్లో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేయనున్నట్లు తెలిపారు.   బుధ, శనివారాల్లో పీహెచ్‌సీ, యూహెచ్‌సీల్లో ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం ఉన్నందున మిగిలిన నాలుగు రోజుల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ చేపట్టాలన్నారు. నేడు వ్యాక్సిన్‌ జిల్లాకు వస్తున్నందున పీహెచ్‌సీలకు పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ట్రైనీ కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు అరుంధతి, కృష్ణకుమారి,  రవి, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo