హాలియా సమగ్రాభివృద్ధికి కృషి

- ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి
హాలియా, జనవరి 11 : హాలియా మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి అన్నారు. సోమవారం హాలియా మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సమస్యల గురించి ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ హాలియా వివిధ ప్రాంతాలకు వెళ్లే కూడలి కావడంతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రభుత్వం హాలియాను మున్సిపాలిటీగా ఏర్పాటుచేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. పట్టణ సమస్యలను సీఎం కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. దోమల నివారణ కోసం మున్సిపాలిటీ నిధులతో ఫాగింగ్ మిషన్ కొనుగోలు చేయాలని, కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బందిని పెంచుకోవాలని సభ్యులు తీర్మానం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, కమిషనర్ వేమనరెడ్డి, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ చింతల చంద్రారెడ్డి, కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, యడవెల్లి అనుపమా నరేందర్‌రెడ్డి, అన్నెపాక శ్రీను, గౌని సుధారాణి, ప్రసాద్‌నాయక్, వర్రా వెంకట్‌రెడ్డి, చింతల దీప్తి, చాపల సైదులు, చెన్ను డొమినిక్, సమీనాఅన్వరుద్దీన్, మేనేజర్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ వాహనాల ప్రారంభం..
హాలియాను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేందుకు రూ.38 లక్షలతో కొనుగోలు చేసిన 6వాహనాలను ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, జేసీ రాహుల్‌శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాలియాను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
తాజావార్తలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు
- సవాళ్లను ఎదుర్కొంటున్న భారత సైన్యం : సీడీఎస్ బిపిన్ రావత్
- షాకింగ్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన దళిత బాలిక హత్య!
- ప్రమీలా జయపాల్‌కు అమెరికాలో అత్యున్నత పదవి
- ఓటీటీ నియంత్రణలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- వేగవంతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
- మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ భామ..!
- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఉర్దూ టీచర్స్ మద్దతు
- యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం
- స్కామ్ 1992 సెకండ్ సీజన్ ఏంటో తెలుసా?