శరవేగంగా

- తిప్పర్తి మండలంలో పూర్తయిన 150 ధాన్యం కల్లాలు
- 430 మంజూరు
- ఆసక్తి చూపుతున్న రైతన్నలు
తిప్పర్తి : రైతుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పంట కల్లాలు నిర్మిస్తూ మరింత తోడ్పాటునందిస్తున్నది. సొంత పొలాల్లోనే ధాన్యం ఆరబెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా సబ్సిడీపై కల్లాలను నిర్మించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. తిప్పర్తి మండలంలో ఇప్పటివరకు సుమారు 430పైగా ధాన్యం కల్లాలను మంజూరు చేసింది. ఎస్సీలకు వందశాతం, బీసీలకు 90శాతం, ఇతరులకు 80శాతం ఉపాధిహామీ పథకం నిధులతో సబ్సిడీపై నిర్మిస్తుండగా.. ఇప్పటివరకు 150 కల్లాలు పూర్తిచేశారు.
కల్లాలతో ఎంతో మేలు..
ధాన్యం కల్లాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని అక్కడే ఆరబెట్టుకోవచ్చు. దీంతో రవాణా ఖర్చులు, శ్రమ తగ్గుతుంది. వర్షం వచ్చినా ధాన్యం పాడవకుండా చూసుకోవచ్చు. పంటను చేను వద్ద నుంచే కొనుగోలు కేంద్రాలకు నేరుగా తీసుకొచ్చి వెంటనే కాంటాలు పెట్టుకోవచ్చు.
రైతులు దరఖాస్తు చేసుకోవాలి
అడిగిన రైతులందరికీ కల్లాలు మంజూరు చేసి త్వరగా పూర్తిచేస్తున్నాం. మండలంలో ఇప్పటికే 150వరకు పూర్తి చేశాం. మిగిలిన వాటిని వీలైనంత త్వరగా పూర్తిచేస్తాం. కల్లాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
- జుల్ఫికర్ అలీ, ఇన్చార్జి ఏపీఓ
13 వైకుంఠధామాలు పూర్తి..
తిప్పర్తి మండలంలోని 26 గ్రామ పంచాయతీలకు అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 13గ్రామాల్లో నిర్మాణాలు పూర్తికాగా, మిగిలినవి ఈనెలాఖరుకు పూర్తి చేయనున్నారు. దహన సంస్కారాలు చేసేందుకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి రూ. 12లక్షల ఉపాధిహామీ నిధుల ద్వారా వైకుంఠధామాలను నిర్మిస్తున్నది. ఒకేసారి రెండు మృతదేహాలను దహనం చేసేలా ప్లాట్‌ఫాంలు, స్నానాల గదులు, మరుగుదొడ్లు, వాటర్ సరఫరా, కరెంటు తదితర సదుపాయాలనూ కల్పిస్తున్నది.
పనులు వేగంగా చేస్తున్నాం..
మండలంలో ఇప్పటికే 13 వైకుంఠధామాలు పూర్తి చేశాం. మిగిలివి నిర్మాణంలో ఉన్నాయి. ఈనెలాఖరు వరకు పూర్తి చేస్తాం. వైకుంఠధామాల్లో సదుపాయాలను కల్పిస్తున్నాం.
- మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం