నోముల ఆశయ సాధనకు కృషి

నల్లగొండరూరల్/రామగిరి/కట్టంగూర్ (నకిరేకల్)/హాలియా, జనవరి 9 : దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. నర్సింహయ్య 65వ జయంతిని జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం, ఫ్లెక్సీలకు పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లగొండ గడియారం సెంటర్లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అమరువీరుల స్తూపం వద్ద ఆ సంఘం జిల్లా కోఆర్డినేటర్ కొమ్మనబోయిన సైదులు, బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ నోముల నర్సింహయ్య చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో నాయకులు మేకల యాదన్న యాదవ్, మామిడి శ్రీను, నవీన్, శివకుమార్, రమేశ్, విశ్వనాథం పాల్గొన్నారు. నకిరేకల్ మెయిన్ సెంటర్లో నిర్వహించిన కార్య క్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నోముల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ నాయకులు పెండెం సదానందం, సామ శ్రీనివాస్‌రెడ్డి, గాదగోని కొండ య్య, కొండ వెంకన్న, కదిరె రమేశ్, వంటెపాక కృష్ణ, బండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
హాలియా ఎమ్మెల్యే క్యాంపు, టీఆర్ఎస్ కార్యాలయాల్లో, ప్రధాన సెంటర్లో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు నోముల ఫ్లెక్సీకి నివాళులర్పించారు. అనుముల మండలంలోని యాచారంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, సర్పంచ్ చెదురుబెల్లి రాములు నివాళులర్పించారు. కార్య క్రమాల్లో మార్కెట్ కమిటీ, మున్సిపల్ చైర్పర్సన్లు యడవల్లి నీలిమామహేందర్రెడ్డి, వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, హాలియా, నిడమనూరు, త్రిపురారం, తిరుమలగిరి సాగర్ మండలాధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, తాటి సత్యపాల్, బహునూతల నరేందర్, పిడిగం నాగయ్య, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పలు మండలాల్లో
నిడమనూరు, పెద్దవూర, గుర్రంపోడు, త్రిపురారం, నాగార్జునసాగర్‌లో నోముల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ కామర్ల జానయ్య, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావు, ఎంపీటీసీ పులిమాల కృష్ణారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవినాయక్, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు పాశం గోపాల్‌రెడ్డి, గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్ రావు, త్రిపురారంలో సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి, నాయకులు మర్ల చంద్రారెడ్డి, రామచంద్రయ్య, పడిశల బుచ్చయ్య, జంగిలి శ్రీను, దస్తగిరి నందికొండలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మందరఘువీర్, పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడికృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మా నందరెడ్డి, బత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వన్‌ప్లస్ 9 సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
- వీడియో : కబడ్డీ ఆడిన నగరి ఎమ్మెల్యే రోజా
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళా ఎమ్మెల్యే
- మేఘన్‌కు సెరెనా విలియమ్స్ మద్దతు
- కోటాపై 50 శాతం పరిమితి : పున:సమీక్షించాలన్న సుప్రీంకోర్టు!
- నేనలా అనలేదు.. మీడియాలో తప్పుగా వచ్చింది: సీజే బొబ్డే
- హిందుస్థాన్ పెట్రోలియంలో ఇంజినీర్ పోస్టులు
- మహిళా దినోత్సవం : మగువలకు టెక్ దిగ్గజం బాసట!
- ఆరోగ్య కారణాలంటూ అభ్యర్థినిని తప్పించిన టీఎంసీ