సోమవారం 08 మార్చి 2021
Nalgonda - Jan 09, 2021 , 01:18:45

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

  • ఎన్‌సీడీసీ చీఫ్‌ డైరెక్టర్‌ తేజావతి

కట్టంగూర్‌/చిట్యాల, జనవరి 8 : పశుసంవర్థశాఖ ద్వారా ప్రభుత్వం అందించే పథకాలను గొర్రెలు, మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) చీఫ్‌ డైరెక్టర్‌ తేజావతి, నల్లగొండ ఐఎస్‌డీపీ ఏడీ విశ్వేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం కట్టంగూర్‌, చిట్యాల మండలం చిట్యాల, నేరడ, వట్టిమర్తి గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో వారు మాట్లాడారు. గొర్రెలు, మేకలను ఇంటెన్సివ్‌ విధానంలో పెంచితే మార్కెటింగ్‌ సదుపాయం పొందవచ్చన్నారు. వ్యాధులు సంక్రమించినప్పుడు వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశాల్లో పశువైద్యాధికారులు రాంప్రసాద్‌, అమరేందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

VIDEOS

logo