లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా అరెస్టు

నీలగిరి/చిట్యాల, జనవరి 8 : నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించి శుక్రవారం నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నకిరేకల్‌కు చెందిన యాదగిరి, చిట్యాలకు చెందిన భిక్షపతి, చిట్యాల మండలం పెద్ద కాపర్తికి చెందిన పుట్లపల్లి కిరణ్ మరో 14మంది కలిసి ముఠాగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ముందుగా నకిరేకల్‌కు చెందిన యాదగిరితో మాట్లాడుకొని పెద్దకాపర్తిలోని కిరణ్ వద్దకు పంపిస్తే రూ.10 వేలు తీసుకుని స్కానింగ్ చేసి ఆడ, మగ అనే విషయాన్ని చెబుతాడు. ఆడపిల్ల అని తెలిస్తే వారు భిక్షపతిని సంప్రదిస్తే ఎక్కడ అబార్షన్ చేయాలో నిర్ణయించి రూ.25 వేలు రేటుగా పెట్టి వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల్లోని చుట్టుపక్కల గ్రామాల్లో ఈ దందాను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దందాకు సంబంధించి మొత్తం 17మంది సభ్యులకు సంబంధం ఉన్నట్లు గుర్తించగా 9మందిని అరెస్టు చేసి రామన్నపేట కోర్టులో హాజరు పరిచారు. మిగిలిన 8 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు.
నాలుగు దవాఖానలు సీజ్..
చిట్యాల మండల కేంద్రంలోని భవానీ, సాయితేజ దవాఖానలు, నార్కట్‌పల్లికి చెందిన చైతన్య దవాఖాన, చౌటుప్పల్‌కు చెందిన ఉషారాణి దవాఖానల్లో లింగ నిర్ధ్దారణ పరీక్షలు చేస్తున్నట్లు రుజువు కావడంతో వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా నిందితులు ఉపయోగిస్తున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, సెల్ఫోన్లు, ప్యాకెట్ డైరీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దందాకు సంబంధం ఉన్న 17 మందిలో బాతుక యాదగిరి, బాతుక భిక్షపతి, పుట్లపల్లి కిరణ్, బోయ నరేశ్, గుండ్లపల్లి నర్సింహ, జల్లా ప్రభాకర్, బాతుక యాదయ్య, జక్కుల గణేశ్, దాను రవిలను ఆరెస్టు చేశామని తెలిపారు. విశ్రాంత ఎంబీబీఎస్ డాక్టర్ కోటేశ్వర్రావు, ఆర్ఎంపీ ఆండాలు, గడ్డం గోవర్ధన్, జిట్టా గణేశ్, అకూరి శ్రీశైలం, పద్మ, ఉషారాణి, వెంకన్న పరారీలో ఉన్నారని తెలిపారు. సఖీ సెంటర్ నిర్వాహకురాలు మందాకిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరందరిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారని తెలిపారు. చిట్యాల సీఐ శంకర్‌రెడ్డి, ఎస్ఐ నాగరాజులను ఆయన అభినందించారు.
తాజావార్తలు
- వృద్ధులతో ప్రయాణమా..ఇలా చేయండి
- బీజేపీ దేశంలో విషం నింపుతుంది: శరద్‌పవార్
- ఈసారి ఐపీఎల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
- ‘అధికారులను కర్రతో కొట్టండి’.. కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- శ్రీశైలం.. ఆది దంపతులకు వరసిద్ధి వినాయకుడి పట్టు వస్త్రాలు
- ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
- ఈ మూడు సమస్యలే గుండె జబ్బులకు ముఖ్య కారణాలట..!
- బీజేపీలో చేరి ‘రియల్ కోబ్రా’ను అంటున్న మిథున్ దా
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్