వానకాలం వడ్లన్నీ కొన్నరు

- 3.05లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
- రూ.530 కోట్లు చెల్లింపులు పూర్తి
- చకచకా సీఎంఆర్.. ఇప్పటికే 40 శాతం పూర్తి
నల్లగొండ, జనవరి7(నమస్తే తెలంగాణ-ప్రతినిధి) : ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)లో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. గత యాసంగిలో ఇబ్బందులు లేకుండా లాక్డౌన్ పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసి చరిత్ర సృష్టించింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లు నిర్వహించారు. గత యాసంగిలో 6.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1195కోట్లను రైతులకు వెనువెంటనే చెల్లించారు. ఆ తర్వాత 99శాతం సీఎంఆర్ పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. దీంతో మిల్లులతోపాటు ఎఫ్‌సీఐ గోదాముల్లోనూ స్థల సమస్య లేకుండా ఈ వానకాలంలో ధాన్యం కొనుగోళ్లు చకచకా జరిపేందుకు ఆస్కారం ఏర్పడింది. వానకాలంలోనూ కొనుగోళ్లను ప్రణాళికాబద్ధంగా కొనసాగించారు. మార్కెట్‌కు వచ్చిన ధాన్యమంతా కొనుగోలు చేశారు.
40శాతం సీఎంఆర్ పూర్తి...
కస్టం మిల్లింగ్ రైస్ సేకరణలో ఇప్పటికే 40శాతం జిల్లా అధికారులు పూర్తి చేశారు. ఈ సారి మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని జిల్లాలోని 110 రైస్‌మిల్లులకు సామర్ధ్యాన్ని బట్టి కేటాయించారు. ఈ ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్, రారైస్‌గా మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి మొత్తం సీఎంఆర్‌ను సేకరించి ఎఫ్‌సీఐకి అప్పగించాలన్న లక్ష్యంతో జిల్లా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ సారి 4.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్‌కు పెట్టాల్సి రావచ్చని అధికారులు ముందుగా భావించారు. కానీ దిగుబడులు తగ్గడంతో సుమారు లక్ష మెట్రిక్ టన్నుల తేడా వచ్చింది. ఇదే సమయంలో ఇక్కడ సీఎంఆర్ సేకరణ వేగంగా సాగుతుండడంతో రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ జిల్లాకు అదనపు కేటాయింపులు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి 75వేల మెట్రిక్ టన్నులు, ములుగు జిల్లా నుంచి 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయించారు. ఇందులో ఇప్పటికే ఖమ్మ జిల్లా నుంచి 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాకు రాగా అందులో 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి సీఎంఆర్‌గా అప్పగించారు. ఇక ములుగు జిల్లా నుంచి కూడా రెండుమూడు రోజుల్లో జిల్లాకు ధాన్యం రావచ్చని తెలిసింది. జిల్లా ధాన్యంతో పాటు ఖమ్మం, ములుగు జిల్లాల నుంచి వచ్చే ధాన్యాన్ని కూడా ఫిబ్రవరి నెలాఖరుకు సీఎంఆర్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ వివరించారు. గత యాసంగి ధాన్యంలో 99శాతం సీఎంఆర్ పూర్తి చేశామని, ఈ సారి కూడా ఇప్పటికే 40శాతం పూర్తిచేశామని తెలిపారు.
3.05లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తి
నల్లగొండ జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 4.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఇది కాకుండా భారీగా సాగైన సన్నరకం ధాన్యం నేరుగా రైస్ మిల్లులకు మరో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వరకు రావచ్చని భావించారు. అయితే అక్టోబర్‌లో వచ్చిన తుఫాన్‌తో వరిపంటకు నష్టం వాటిల్లి దిగుబడిపై ప్రభావం చూపించింది. ధాన్యం నాణ్యతలోనూ తేడా రావడంతో రైతులు ప్రారంభంలో కొనుగోళ్లపై కొంత ఆందోళన చెందారు. జిల్లా అధికారులు రంగంలోకి దిగడంతో సన్నరకం ధాన్యం కొనుగోళ్లు ఇబ్బందులు లేకుండా జరిగాయి. సుమారు 3.50లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్నరకం ధాన్యాన్ని నేరుగా మిల్లర్లు కొనుగోలు చేసినట్లు అంచనా. ఇక దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎప్పటిలాగే జిల్లాలో ఐకేపీ, మార్కెటింగ్ శాఖ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 188 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటివరకు మొత్తం 3.05లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ.570 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.530 కోట్లు పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో మిగతా చెల్లింపులు కూడా జరుగనున్నాయి. అక్కడకక్కడా రైతుల వద్ద ధాన్యం ఉంటే అది కూడా కొనుగోలు చేసేందుకు మార్కెట్‌యార్డులు, కొన్ని పీఏసీఎస్‌ల పరిధిల్లోని 15 కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- హైదరాబాద్‌లో నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!