శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 08, 2021 , 01:27:59

అయ్యప్ప ప్రసాదం ఇంటికే...

అయ్యప్ప ప్రసాదం ఇంటికే...

  • ఇదే మొదటిసారి
  • పోస్టాఫీసులో బుక్‌ చేస్తే చాలు
  • మకర జ్యోతి దర్శనం వరకు అవకాశం

కరోనా పరిస్థితుల్లో శబరిమలకు వెళ్లలేకపోతున్న భక్తుల కోసం అయ్యప్ప ఆశీస్సులతో ఇంటికే ప్రసాదం వస్తున్నది. పోస్టాఫీసుకు వెళ్లి రూ.450 చెల్లిస్తే చాలు.. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం మీ అడ్రస్‌కు ప్రసాదం కిట్‌ను పంపిస్తున్నది. తపాలా శాఖ చొరవతో తొలిసారి ఈ సౌలభ్యం ఉమ్మడి జిల్లాలో అందుబాటులోకి రాగా, ఇప్పటివరకు 3,500కిపైగా డెలివరీ అయినట్లు

పోస్టల్‌ అధికారులు తెలిపారు. 

రామగిరి, జనవరి 7: అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని భక్తుల ఇంటికే అందించేలా తపాలాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బుక్‌ చేసుకున్న భక్తుల ఇంటికే ప్రసాదం కిట్‌ అందుతోంది. గతంలో ఆశీర్వచనం పేరిట టీటీడీ ప్రసాదాన్ని భక్తులకు అందించిన తపాలాశాఖ ప్రస్తుతం అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని కూడా భక్తులకు చేరవేస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జ్యోతి దర్శనం వరకు అవకాశాన్ని కల్పించాలని ఆశాఖ నిర్ణయిం చింది. 

ప్రసాదం ఇలా పొందవచ్చు.

భక్తుల సౌకర్యార్థం దేవస్థానం, తపాలాశాఖ ప్రసాదాన్ని చేరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రసాదం కిట్‌ కావాలనుకునే భక్తులు పోస్టాఫీసుకు వెళ్లి నిర్ణీత దరఖాస్తు నింపి రూ. 450 చెల్లించాల్సి ఉంటుంది. ఒక దరఖాస్తుకు ఒక కిట్‌ మాత్రమే వస్తుంది. ఎన్ని కావాలంటే అన్ని దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది.  

చాలా మంది తెప్పించుకుంటున్నారు

ట్రావెన్‌కోర్‌ దేవస్థానం  తపాలాశాఖ ద్వారా అందించే అయ్యప్పస్వామి ప్రసాదానికి మంచి డి మాండ్‌ ఉంది. పోస్టాఫీసుకు వచ్చి రూ.450 చెల్లిస్తే భక్తుల అడ్రస్‌కు ప్రసాదం కిట్‌ను చేరవేస్తాం. జిల్లాలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ సౌకర్యం ఉంది. కరోనా కారణంగా శబరిమలకు వెళ్లలేని భక్తులకు ఇది వరం లాంటిది. 


VIDEOS

logo