నేడు కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్

- నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 75కేంద్రాలు
- రెండు జిల్లాల్లో 1875మందికి డమ్మీ వ్యాక్సిన్
- ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యారోగ్యశాఖ యంత్రాంగం
నీలగిరి, జనవరి 7 : కరోనా వ్యాక్సినేషన్ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ మేరకు శుక్రవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో డ్రై రన్ నిర్వహణకు వైద్యారోగ్యశాఖ సర్వం సిద్ధం చేసింది. వ్యాక్సిన్ నిల్వకు ఫ్రీజర్లు ఏర్పాటు చేయడం మొదలుకొని ట్రయల్ రన్లో భాగస్వాములైన వారి ఫోన్లకు సందేశాలు పంపడం తదితర ప్రక్రియను చేపట్టనున్నారు. డ్రై రన్లో పాల్గొనే వైద్యులతోపాటు సిబ్బందికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు.
వైద్య సిబ్బందికి శిక్షణ పూర్తి
వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే సిబ్బందిపై ఒత్తిడి పడకుండా పంపిణీ చేసే విధానంపై మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నారు. మొదటి విడుతలో టీకాలు వేసేందుకు నల్లగొండ జిల్లాలో 10,866మందిని, సూర్యాపేట జిల్లాలో 2794మందిని గుర్తించారు. వారి వివరాలు కొవిడ్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. ఈ జాబితాలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆయాలున్నారు. ఒక్కో కేంద్రంలో ఐదుగురు సిబ్బందిని నియమించగా ప్రతి కేంద్రంలో 25మంది చొప్పున 1875మందికి డమ్మీ టీకా ఇవ్వనున్నారు. వీరందరికీ ఇప్పటికే ఫోన్ ద్వారా సమాచారాన్ని చేరవేశారు. ఏ దవాఖానకు హాజరుకావాలి..? సమయం తదితర వివరాలను తెలియజేశారు. టీకా కోసం వెళ్లే సిబ్బంది ఆరోగ్య కేంద్రం లోపలికి వెళ్లగానే శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొదటి గదిలో వ్యాక్సినేషన్ ఆఫీసర్‌కు ఆధార్ గుర్తింపు కార్డు చూపించాలి. ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వివరాలను ట్యాబ్‌లో పరిశీలిస్తారు. డాటా ఎంట్రీ నమోదు చేసి టీకా ఇస్తున్నట్లుగా నమోదు చేస్తారు. తదుపరి రెండోగదిలో వ్యాక్సినేషన్ అధికారి టీకా(డమ్మీ) ఇస్తారు. అనంతరం మూడో గదిలో 30నిమిషాల పాటు పరిశీలనలో ఉంచుతారు. ఈ గదిలో రద్దీ లేకుండా క్రమబద్ధీకరిస్తారు. ఆయా కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ శానిటైజేషన్ చేసుకోవడంతో పాటు మాస్కు ధరించి భౌతిక దూరం తప్పక పాటించాలి.
ఐదు మోడల్ కేంద్రాలు..
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో డ్రై రన్‌కు మొత్తం 75కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పరిశీలకుల సౌకర్యార్థం నల్లగొండ జిల్లాలో ఐదు కేంద్రాలను మోడల్‌గా తీసుకున్నారు. వీటిలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ అర్బన్ హెల్త్‌సెంటర్, డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సీడబ్ల్యూసీ, జిల్లా జనరల్ దవాఖానలో మూడు కేంద్రాలు, నార్కట్‌పల్లిలోని కామినేని, మిర్యాలగూడ ఏరియా దవాఖాన ఉన్నాయి. ఇవి కాకుండా మరో 42 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నూతనంగా మంజూరైన అడవిదేవులపల్లి, బొడ్డుపల్లి (కొండమల్లేపల్లి మండలం) పీహెచ్‌సీలతోపాటు 32 పీహెచ్‌లు, నాలుగు యూహెచ్‌సీలు, దేవరకొండ, నాగార్జునసాగర్‌లో ఏరియా దవాఖానలు, మిర్యాలగూడలోని జ్యోతి హాస్పిటల్, నాగార్జునసాగర్‌లోని పీపీ యూనిట్లో ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 43పీహెచ్‌సీల్లో 24గంటలు నడిచేవి 18పీహెచ్‌సీలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 28ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా కేంద్ర జనరల్ దవాఖాన, మూడు ఏరియా దవాఖానల్లో డ్రై రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
డ్రై రన్‌కు ఏర్పాట్లు పూర్తి
కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి కేంద్రంలో 25మంది సిబ్బందిని భాగస్వాములను చేయనున్నాం. వెరిఫికేషన్, వ్యాక్సినేషన్, అబ్జర్వేషన్‌కు ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేశాం. వ్యాక్సినేషన్లో పాల్గొనే వైద్యులు, సిబ్బంది మాస్కులు, గ్లవ్స్ ధరించడంతోపాటు కొవిడ్ నిబంధనలను పాటించాలి.
-డా.కొండల్రావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, నల్లగొండ
తాజావార్తలు
- ఉత్తమ రైతు మల్లికార్జునర్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!
- నూతన సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన