Nalgonda
- Jan 08, 2021 , 01:28:03
VIDEOS
పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు స్థల పరిశీలన

కనగల్, జనవరి 7: మండలంలోని జి.యడవల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని తాసీల్దార్ శ్రీనివాస్‌రావుతో కలిసి ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గ్రామంలోని 351,352, 254,356 సర్వే నంబర్ల పరిధిలోని 43.35 ఎకరాల భూమి తమదేనని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లినప్పటికీ కోర్టు వారి కేసును కొట్టేసిందన్నారు. ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తాసీల్దార్‌ను ఆదేశించారు. మొక్కలు నాటించాలన్నారు. అలాగే మండల కేంద్రంలోని సర్వే నంబర్ 333లో గుర్తించిన 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో రెసిడెన్షియల్ పాఠశాలకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING