విద్యోగోన్నతులు!

- జిల్లా విద్యాశాఖలో ప్రమోషన్ల కసరత్తు
- సీనియారిటీ జాబితా తయారీలో నిమగ్నం
- ఖాళీల గుర్తింపు షురూ..
- ఉమ్మడి జిల్లాలో 1,116 మందికిఉద్యోగోన్నతిఅవకాశం
- విద్యాశాఖలో ప్రమోషన్ల హడావుడి మొదలైంది.
ఉద్యోగోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అన్ని శాఖల మాదిరిగానే కసరత్తు నడుస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని మండలాల వారీగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, జీహెచ్‌ఎంల సీనియారిటీ జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన ప్రమోషన్లు ఉండాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ విధానం అమలు చేస్తేక్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతాయన్నఅభిప్రాయాన్ని విద్యా రంగ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు.
- రామగిరి, జనవరి 6
రామగిరి, జనవరి 6 : ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల ప్రక్రియ కోసం విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఎంఈఓల నుంచి సీనియార్టీ జాబితాను సేకరించిన అధికారులు స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల వరకు జాబితాను సిద్ధం చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనకు ముందు జూలై 2015లో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి ప్రక్రియ నిర్వహించారు. తర్వాత 2018లో ఈ ప్రక్రియ ప్రారంభించగా కొంతమంది ఉపాధ్యాయులు కొత్త జిల్లాల వారీగా ఉద్యోగోన్నతులు కల్పించాలని హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా.. ప్రక్రియ నిలిచిపోయింది.
సీనియార్టీ జాబితా తయారీలో..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను సిద్ధం చేసే పనిలో విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్.. ప్రధానోపాధ్యాలుగా ఎంతమందికి ప్రమోషన్ ఇవ్వవచ్చనే విషయమై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అన్ని మండలాల ఎంఈఓల నుంచి వివరాలు తెప్పించి ప్రత్యేక ఫార్మాట్లో నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగానే సీనియార్టీ జాబితాను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా కేటగిరీల్లో ఉద్యోగోన్నతులకు 1,116 (గెజిటెడ్ హెచ్ఎంలు 271, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం 275, స్కూల్ అసిస్టెంట్స్ 570) ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారంరోజుల్లో ఖాళీలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఖాళీలు 2,179
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ విభాగాల్లో 2,179 ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. వీటిలో గెజిటెడ్ హెచ్ఎం, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఖాళీలను ఉద్యోగోన్నతులతో భర్తీ చేస్తారు. దీంతో పాటు సీనియార్టీ ప్రకారం ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి లభిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఖాళీల వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈసారి ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఎస్జీటీ పోస్టుల ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
ప్రభుత్వ ఆదేశాల మేరకే జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల వివరాలను ఎంఈఓల ద్వారా సేకరించాం. వాటి ఆధారంగా సీనియార్టీ జాబితా తయారు చేస్తున్నాం. దీంతోపాటు ఆయా కేటగిరీల్లో ఖాళీల వివరాలు తీసుకుంటున్నాం. ఉద్యోగోన్నతులపై స్పష్టమైన నిబంధనలు, నియమాలు రావాల్సి ఉంది. ఆలోపు పూర్తి సమాచారం సిద్ధం చేస్తున్నాం. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పూర్తి సమాచారం అందితే ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.
- బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
తాజావార్తలు
- 5 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
- రేడియోలాజికల్ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ డిప్లొమా
- ఎంపీ కొడుకుపై కాల్పులు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి