బుధవారం 03 మార్చి 2021
Nalgonda - Jan 07, 2021 , 00:40:30

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నం.1

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నం.1

  • ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి

గుర్రంపోడు, జనవరి 6 : సీఎం కేసీఆర్‌ పట్టుదలతో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో ఉందని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తాసీల్దార్‌ కార్యాలయంలో 47మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, కేసీఆర్‌ కిట్‌,  ఆసరా పింఛన్లు తదితర పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నల్లగొండ-దేవరకొండ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని, మండల కేంద్రంలో రోడ్డు విస్తరణతోపాటు బస్‌ షెల్టర్‌ మంజూరు చేయాలని ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీని కోరగా మంత్రిగారి సహకారంతో సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో తాసీల్దార్‌ అంబటి ఆంజనేయులు, ఎంపీడీఓ సుధాకర్‌, డీటీ జావీద్‌, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్‌రావు, వజ్జ ధనుంజయ, రవి, కిరణ్‌, నగేశ్‌, చక్రవర్తి, తిరుమల్‌రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.   

సాగర్‌ స్థానం మాదే.. 

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైన పరిస్థితుల్లో గెలిచే వారికే టికెట్‌ ఇచ్చే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి పేర్కొన్నారు. బుధవారం గుర్రంపోడులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, దుబ్బాక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సిట్టింగ్‌ సీటైన సాగర్‌లో బలమైన అభ్యర్థిని నిలిపే ఆలోచనలో అధిష్ఠానం ఉందన్నారు. ఎవరికి టికెట్‌ ఇచ్చినా అందరూ సమన్వయంతో పనిచేసి సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకుంటామని అన్నారు.  

VIDEOS

logo