శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Jan 07, 2021 , 00:35:46

కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌కు సిద్ధం కావాలి : ఎంపీపీ

కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌కు సిద్ధం కావాలి : ఎంపీపీ

మిర్యాలగూడ రూరల్‌, జనవరి6 : ఈ నెల 8న ఆలగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించే కరో నా వ్యాక్సిన్‌ డ్రై రన్‌కు టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు సిద్ధం కావాలని ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి కోరారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో కొవిడ్‌19 టాస్క్‌ఫోర్స్‌ టీం అవగాహన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అజ్మీరా దేవిక, మండల వైద్యాధికారి చింతల వనిత, సీడీపీఏ మమత తదితరులు పాల్గొన్నారు. 

త్రిపురారం : కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌పై బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి రామకృష్ణప్రసాద్‌రావు, పెద్దదేవులపల్లి వైద్యుడు జానకీరాములు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ భారతి, తాసీల్దార్‌ కేసీ ప్రమీల, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ, ఎస్‌ఐ రామ్మూర్తి, ఎంఈఓ బాలాజీనాయక్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 


VIDEOS

logo