మంగళవారం 09 మార్చి 2021
Nalgonda - Jan 04, 2021 , 02:00:57

ప్రజారోగ్యానికి రక్ష

ప్రజారోగ్యానికి రక్ష

  • సకాలంలో గుర్తించకపోతే..
  • నల్లగొండ శివారులోని కతాల్‌గూడకు చెందిన 48 ఏండ్ల వ్యక్తి 

ఏడేండ్లుగా షుగర్‌, బీపీతో బాధపడుతున్నాడు. సకాలంలో మధుమేహం సమస్యను గుర్తించకపోవడంతో కిడ్నీలపై ప్రభావం పడింది. రెగ్యులర్‌గా బీపీ, షుగర్‌ చెక్‌ చేయించుకుని మందులు వాడితే పరిస్థితి డయాలసిస్‌ దాకా వచ్చేది కాదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏమేం జాగ్రత్తలు పాటించాలో కూడా తెలియక అక్కడి దాకా తెచ్చుకున్నాడు.అసంక్రమిత వ్యాధులపై హెల్త్‌ ప్రొఫైల్‌30 ఏండ్లు పైబడిన వారందరికీ పరీక్షలుమెరుగైన వైద్య సేవలకు నిరంతర పర్యవేక్షణఆశాలు, ఏఎన్‌ఎంలకు సర్వే బాధ్యతలునల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లలో శిక్షణ పూర్తిహెల్త్‌ ప్రొఫైల్‌ అందుబాటులోకి వస్తే..ఇకపై.. బీపీ, షుగర్‌ వంటి 8 రకాల అసంక్రమిత వ్యాధులతో బాధపడే ప్రతి ఒక్కరిపైనా వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ ఉంటుంది. పరిస్థితి విషమించకుండా ఆశాలు, ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు సూచిస్తారు. 104 వాహనంలో వచ్చి ప్రతి నెలా మందులు ఇస్తారు. కండీషన్‌ను బట్టి ముందే డాక్టర్‌ సలహా ఇప్పించి ఏ ఆస్పత్రికి వెళ్లాలో వివరించి ప్రాణాపాయం నుంచి తప్పిస్తారు. ఆ మేరకు ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తున్నారు.

ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం 

మరొక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేసి.. అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో మెరుగైన చికిత్స, మందులు, సలహాలు, సూచనలు అందించనున్నది. నిరంతర పర్యవేక్షణకు ఆశాలు, ఏఎన్‌ఎంలకు బాధ్యతలు అప్పగించనున్నది. ఆ మేరకు నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లలో ఇప్పటికే శిక్షణ పూర్తయింది. 100 రోజుల ప్రణాళికతో రంగంలోకి దిగనున్న వైద్య సిబ్బంది 30 ఏండ్లకు పైబడిన ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్‌ చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఒక యూనిక్‌ నంబర్‌ కేటాయించి, ఆరోగ్య సంబంధ వివరాలు, తీవ్రతను ఆన్‌లైన్‌ చేస్తారు. బీపీ, షుగర్‌ వంటివి నిర్ధారణ అయితే ప్రతి నెలా మందులు ఇస్తారు. క్యాన్సర్‌, గుండె సంబంధ సమస్యలను గుర్తిస్తే, మెడికల్‌ ఆఫీసర్‌ ద్వారా నిర్ధారించుకుని 104 వాహనంలో పెద్దాస్పత్రులకు తరలిస్తారు. వ్యాధిగ్రస్తుడు ఏదైనా పట్టణానికి వెళ్లినప్పుడు ఆరోగ్య సమస్య వస్తే తనకు కేటాయించిన నంబర్‌ చెప్తే చాలు.. ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చెయ్యగానే హెల్త్‌ రిపోర్ట్‌ మొత్తం క్షణాల్లో డాక్టర్‌ ముందుంటుంది.

  • అసంక్రమిత వ్యాధులపై హెల్త్‌ ప్రొఫైల్‌  
  • 30ఏండ్లు పైబడిన వారందరికీ పరీక్షలు
  • మెరుగైన వైద్య సేవలకు నిరంతర పర్యవేక్షణ  
  • ఆశాలు, ఏఎన్‌ఎంలకు సర్వే బాధ్యతలు ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డు...

ఆధార్‌ కార్డున్న ప్రతి ఒక్కరికీ నెంబర్‌ను ఇస్తారు. ఫొటో, బరువు, వయస్సు, ఆధార్‌ నెంబర్‌, వ్యాధుల వివరాలను నమోదు చేస్తారు. రోగాలు ఏస్థాయిలో ఉన్నాయి..? వారు ఎలాంటి వైద్యం తీసుకోవాలి..? ఏ మందులు వాడాలి అనేది నిత్యం పర్యవేక్షిస్తారు. వారికి ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వైద్యం అందేలా కృషి చేయనున్నారు. 30ఏళ్లు పైబడిన వారు నల్లగొండ జిల్లాలో 8,62,486మంది ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. సగటు జీవి ఆయురారోగ్య ప్రమాణాలు పెంచే పథకాలు రాష్ట్రంలో అనేకం అమలవుతున్నాయి. అందుకే ఆరోగ్య సూచికలు, అనేక సంస్థల సర్వేలు సైతం తెలం‘గానం’ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం   మరో అడుగు ముందు కు వేసింది. ఆశ వర్కర్లు మొదలుకుని ఏఎన్‌ఎంల వరకు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ ప్రజల ఆరోగ్య విషయాలను నమోదు చేయించనున్నది. ‘విలేజ్‌ హెల్త్‌ రిజిస్ట్రేషన్‌'కు అనుసంధానంగా ‘హెల్త్‌ ప్రొఫైల్‌ ఆఫ్‌ తెలంగాణ’ను రూపొందించనున్నది. తద్వారా దీర్ఘకాలిక, ప్రమాదకర వ్యాధులతో బాధ పడుతున్నవారికి వైద్యసాయంతో పాటు నిత్యం పర్యవేక్షణ చేసి ఆరోగ్య సలహాలు, సూచనలు అందజే యను న్నారు. 

ముఖ్యంగా గుర్తించనున్న ఎనమిది రోగాలివే... 

దీర్ఘకాలిక, అసంక్రమిత వ్యాధులను గుర్తించనున్నారు. ప్రధానంగా బీపీ, షుగర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, సర్వైకల్‌, నోటి క్యాన్సర్‌, టీబీ, కుష్టు, మానసిక రోగాలను గుర్తించనున్నారు. వీటితోపాటు మరికొన్ని రోగాలను కూడా గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. 

ఆన్‌లైన్‌లో రిపోర్టు...

జిల్లా వ్యాప్తంగా ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎంలను భాగస్వాములను చేస్తూ ప్రతి గ్రామం, తండా, గూడేల్లో ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించనున్నారు. ప్రతి మనిషిని స్క్రీనింగ్‌ చేసి ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. మనిషి బరువు, ఎత్తు, వ్యక్తిగత వివరాలు, రోగాలకు సంబంధించిన వివరాలను సేకరించనున్నారు. పరీక్షలు నిర్వహించి సమస్య ఉంటే వీడియో ద్వారా బాధితులకు అవగాహన కల్పించనున్నారు. 104వాహనం ద్వారా మందుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సేవలకు వాహనాన్ని ఏర్పాటు చేసి దగ్గరలో ఉన్న రిఫరల్‌ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారు. స్పెషలిస్టులు పరీక్షలు చేసి వైద్యం అందించేందుకు ఎంఎన్‌టీ క్యాన్సర్‌ దవాఖానకు తీసుకెళ్లి పూర్తి స్థాయి వైద్యం అందించి వ్యాధి నయమయ్యే వరకు ప్రభుత్వ పరంగా పూర్తి బాధ్యత వహిస్తారు. 

కేసీఆర్‌ కిట్‌.. పేషెంట్‌ కేర్‌.. నవజాత శిశు సంరక్షణ.. ఆపరేషన్లు లేని సుఖ ప్రసవాలు.. ఇంటింటికీ కంటి పరీక్షలు, ఉచిత రోగ నిర్ధారణ టెస్టులు.. గర్భిణుల వైద్య పరీక్షలకు 102వాహనాలు.. ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర సర్కారు.. ప్రజల ఆరోగ్యం దిశగా మరో అడుగు ముందుకేసింది. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సంకల్పించింది. మంచానికే పరిమితమై ఇతరులపై ఆధారపడిన వారికి చికిత్సతోపాటు వారి అరోగ్యస్థితిగతులపై నిత్యం పర్యవేక్షించనున్నది. ఈ క్రమంలో జిల్లాలో 30ఏండ్ల పైబడిన వారికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా ‘విలేజ్‌ హెల్త్‌ రిజిస్ట్రేషన్‌' పేరుతో చేపట్టిన సర్వే దాదాపు పూర్తి కావచ్చినట్లు సమాచారం. 

జిల్లాలో 16,18,416జనాభా...

2011జనగణన ప్రకారం జిల్లా జనాభా 16,18,416మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇందులో 8,18,306మంది పురుషులు, 8,08,110స్త్రీలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 12,50,113మంది, పట్టణాల్లో 3,68,303మంది ఉన్నారు. నల్లగొండ జిల్లాలో ఆరేండ్ల వయస్సులోపు చిన్నారులు 1,81,996మంది ఉన్నారు. వీరిలో 1,43,491మంది గ్రామాల్లో నివసిస్తుండగా 38,505మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. అందులో 94926 మగ, 87070ఆడ పిల్లలున్నారు. 

జిల్లాలోని ప్రతిఒక్కరి ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం. వారికి వైద్యసాయంతో పాటు ఉచితంగా మందులు అందిస్తాం. ఇప్పటికే విలేజ్‌ హెల్త్‌ రిజిస్ట్రేషన్‌లో వివరాలు నమోదు చేస్తున్నాం. మేజర్‌ ఆరోగ్య సమస్యలుంటే వారి వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం. ప్రతిసారి టెస్టులు అవసరం లేకుండా నిత్యం పర్యవేక్షణ చేయనున్నాం. ఇప్పటికే మిర్యాలగూడ, నల్లగొండ డివిజన్‌ పరిధిలోని ఏఎన్‌ఎంలకు శిక్షణ పూర్తి చేశాం. ఒకటీ రెండ్రోజుల్లో దేవరకొండ డివిజన్‌ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నాం. 

- డా.కొండల్‌రావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి. నల్లగొండ 


VIDEOS

logo