శనివారం 06 మార్చి 2021
Nalgonda - Jan 04, 2021 , 02:00:59

క్షతగాత్రుల పట్ల ఎమ్మెల్యే చిరుమర్తి ఔదార్యం

క్షతగాత్రుల పట్ల ఎమ్మెల్యే చిరుమర్తి ఔదార్యం

నార్కట్‌పల్లి, జనవరి 3 : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దగ్గరుండి దవాఖానకు తరలించి ఔదార్యం చాటుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం తొండల్‌వాయి గ్రామానికి చెందిన దాసరి మల్లయ్య, బెల్లి లక్ష్మయ్య బైక్‌పై ఆదివారం నార్కట్‌పల్లిలోని కామినేని దవాఖానకు వెళ్తుండగా మార్గమధ్యంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ  తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ సమయంలో నార్కట్‌పల్లి నుంచి నకిరేకల్‌కు వెళ్తున్న చిరుమర్తి తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుల వద్దకు వెళ్లారు. వెంటనే వాహనాన్ని తెప్పించి కామినేని దవాఖానకు తరలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అధైర్య పడవద్దని, కుటుంబానికి అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ.25వేలు అందజేసి తన అనుచరులను దవాఖాన వద్ద ఉంచి వెళ్లారు.

VIDEOS

logo