ఆదివారం 07 మార్చి 2021
Nalgonda - Jan 04, 2021 , 02:00:59

జాబితా ప్రక్షాళన

జాబితా ప్రక్షాళన

  • అంగన్‌వాడీ లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేత 
  • డిలీట్‌ ఆప్షన్‌ లేకపోవడంతో కొనసాగుతున్న పేర్లు
  • బయట చలి.. లోపల ఆకలి..! 
  • వణుకు పుట్టించే చలి.. తెల్లవారుతున్నా తెరిపినివ్వని పొగమంచు.. 
  • ఆకలి మంట తీర్చుకునేందుకు పక్షులు ఆహారవేటను కొనసాగిస్తున్న తీరు 
  • సైతం ప్రకృతి అందాలకు మరింత రంగులద్దుతున్నది. చెట్టు మీద పక్షులు.. 
  • కొమ్మలపై వాలిన పిట్టలు.. చెరువు నీటిలో కొంగలు ఆహారాన్ని అన్వేషిస్తూ 
  • ‘నమస్తే’ కెమెరాకు చిక్కాయి. ఆదివారం తెల్లవారుజామున నల్లగొండ మండలం
  • జీకే అన్నారం, అన్నారెడ్డిగూడెంలో విహంగ విహారమిది.

అంగన్‌వాడీ కేంద్రాల్లో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండు కేంద్రాల్లో నమోదైన వారితో పాటు అనర్హుల పేర్ల తొలగింపునకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం డిలీట్‌ ఆప్షన్‌ ఇవ్వడంతో 2014నుంచి ఆన్‌లైన్‌లో నమోదైన అనర్హులను ఏరివేయనున్నారు. ఆరేండ్లు పైబడిన పిల్లలు, బాలింతలు కాని వారి పేర్లు జాబితా నుంచి తొలగిపోనున్నాయి. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతల లెక్కలు పక్కాగా ఉండే అవకాశం ఉంది.

హుజూర్‌నగర్‌ : అనర్హుల పేర్లను తొలగింపునకు ఉన్నతాధికారులు అంగన్‌వాడీ టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రాజెక్ట్‌ పరిధిలోని ఐసీడీఎస్‌ అధికారులు జాబితాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. జాబితాలో ఒకే లబ్ధిదారుడి పేర్లు రెండు ప్రాంతాల్లో నమోదైన వాటిని గుర్తించి తొలగిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడి అర్హులకు లాభం చేకూరే అవకాశం ఉంది. 

ఆరు వేల మంది పేర్లు తొలగింపు..

జిల్లాలో హుజూర్‌నగర్‌, సూర్యాపేట అర్బన్‌, కోదాడ, చివ్వెంల, తుంగతుర్తి ప్రాజెక్ట్‌లున్నాయి. 1209అంగన్‌వాడీ కేంద్రాలుండగా వీటిలో 1126ప్రధాన, 83మినీ కేంద్రాల్లో సుమారు 15,300మంది గర్భిణులు, బాలింతలు, ఏడు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 67,572 మంది పాఠాలు నేర్చుకుంటున్నారు. అయితే, అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని పోషకాహారం పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య కన్నా ఆన్‌లైన్‌లో నమోదైన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. జిల్లాలో ఐదు ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు ఆరు వేల మందికి పైగా అనర్హులను తొలగించగా, మరో వారం రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

వడ్లు బుక్కుతున్నరు!

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : కస్టం మిల్లింగ్‌ ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకుంటున్నట్లు సమాచారం. మిల్లులను ఏ ఒక్కరూ కూడా తనిఖీ చేయకపోవడంతో యథేచ్ఛగా దందా కొనసాగుతున్నది. గత యాసంగిలో సేకరించిన ధాన్యం తాలూకూ సీఎమ్మార్‌ నేటికీ 40నుంచి 60శాతానికి మించలేదు. వానకాలం ధాన్యం కూడా మిల్లుల్లో నిల్వ ఉన్నది. ఇప్పటికే టన్నుల కొద్దీ బయటి మార్కెట్‌లో విక్రయించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అక్రమాలకు అంతే లేదు.. మిల్లర్లు పీడీఎస్‌ బియ్యాన్నే సీఎమ్మార్‌గా పెడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరి కొందరు రేషన్‌ దుకాణాలకు సరఫరా చేసే పీడీఎస్‌ బియ్యాన్ని గోదాములోనే ఉంచి కాగితాలు మాత్రమే అటుఇటూ తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడి జైలుపాలైన వారే ఇటీవల మళ్లీ శ్రీకారం చుట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సివిల్‌ పోలీసులే అధికంగా పీడీఎస్‌ బియ్యం పట్టుకొని కేసులు చేస్తున్నారు తప్ప సివిల్‌ సైప్లె అధికారుల తనిఖీలు మచ్చుకైనా లేవు. నిఘా విభాగం పట్టింపు కొరవడిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

భారీగా పీడీఎస్‌ బియ్యం పట్టివేత...

జిల్లా వ్యాప్తంగా పీడీఎస్‌ బియ్యం పెద్ద ఎత్తున పట్టుబడుతున్నది. పోలీస్‌శాఖ గతేడాది 1620క్వింటాళ్లు పట్టుకుని 85కేసులు నమోదు చేసింది. ఇక పట్టుబడని సరుకు లెక్క చిక్కనేలేదు. తాజాగా శనివారం రాత్రి మునగాల మండలం బరాఖత్‌గూడెంలో 75క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం మిల్లులకు తరలించేందుకు సిద్ధం చేస్తుండగా సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. అలాగే డిసెంబర్‌ 9న సూర్యాపేట పట్టణంలోని వీటీ రోడ్డులో 20క్వింటాళ్లు, 10న భగత్‌సింగ్‌నగర్‌లో 14క్వింటాళ్ల బియ్యం, 24న సూర్యాపేట జమ్మిగడ్డలో 13క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. పెన్‌పహాడ్‌ మండలం గాజులమల్కాపురంలో 104క్వింటాళ్ల బియ్యం, కోదాడ మండలం గుడిబండలో 30క్వింటాళ్లు, కొమరబండ శివారులోని రైస్‌మిల్లులో లారీ లోడు బియ్యం, మఠంపల్లిలో 200క్వింటాళ్లు సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పీడీఎస్‌ బియ్యం పట్టుబడుతుండడం మిల్లుల్లో జరుగుతున్న దందాకు అద్దం పడుతున్నది.

తనిఖీలు చేస్తున్నాం... కఠిన చర్యలు తప్పవు...

కస్టం మిల్లింగ్‌ వంద శాతం సేకరించి తీరుతాం. సిబ్బందితో తరచూ తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడైనా సీఎమ్మార్‌ కోసం సేకరించిన ధాన్యం తక్కువ ఉన్నా, పీడీఎస్‌ బియ్యం సేకరిస్తున్నట్లు తనిఖీల్లో తేలినా కఠిన చర్యలు తప్పవు. సీఎమ్మార్‌ తక్కువ ఇచ్చిన మిల్లులపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. అవసరమైతే ఇతర మిల్లులకు ధాన్యం తరలిస్తాం. ఇటీవల బియ్యం పట్టుబడిన విషయమై జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించాం.

- ఎన్‌.విజయలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి 

ఇంటి వద్దకే పౌష్టికాహారం..

అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఇంటి వద్దకు వెళ్లి పౌష్టికాహారం అందిస్తున్నారు. అనర్హులను జాబితా నుంచి తొలగించాలంటే డిలీట్‌ ఆప్షన్‌ లేకపోవడంతో అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల జాబితా చాలా పెద్దదిగా కనిపిస్తోంది. తాజాగా ప్రభుత్వం అనర్హుల జాబితాను తొలగింపునకు పూనుకోవడంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

తొలగింపు ప్రారంభమైంది..

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణుల లెక్క పక్కాగా ఉంటుంది. గతంలోనే అనర్హుల పేర్లను గుర్తించినప్పటికీ డిలీట్‌ ఆప్షన్‌ లేకపోవడంతో తొలగించలేదు. ప్రస్తుతం అనర్హుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. వారం రోజుల్లో పూర్తవుతుంది. 

- నరసింహారావు, ఐసీడీఎస్‌ పీడీ, సూర్యాపేట

VIDEOS

logo