దేవాలయ అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలి

- జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
- అట్టహాసంగా చెర్వుగట్టు ఆలయ నూతన పాలకమండలిప్రమాణ స్వీకారం
నార్కట్‌పల్లి జనవరి 3 : తెలంగాణ శైవక్షేత్రంగా పేరొందిన చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధే లక్ష్యంగా నూతన పాలకమండలి పని చేయాలని జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం చెర్వుగట్టు దేవాలయంలో నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం దేవాదాయశాఖ ఏసీ మహేంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చైర్‌పర్సన్‌గా మేకల అరుణారాజిరెడ్డిని ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా అర్చకులు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, ఈఓ సులోచన పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బండా, చిరుమర్తి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికోసం చెర్వుగట్టు చరిత్రలోనే తొలి మహిళా చైర్‌పర్సన్‌ను నియమించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో కమిటీని నియమించినట్లు తెలిపారు. యాదాద్రి తరహాలో చెర్వుగట్టును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో గుట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని ఇంకా అవసరమైతే యువ నాయకుడు, మంత్రి కేటీఆర్ సహకారంతో పనులు పూర్తి చేస్తామని అన్నారు. దేవాలయానికి వచ్చే మార్గంలో డివైడర్‌తో డబుల్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. గుట్ట కింద గిరి ప్రదక్షిణ కోసం గతంలో స్థల సేకరణ జరిగిందని, త్వరలో ఆ స్థల సేకరణను పూర్తిచేస్తామని తెలిపారు. ఎల్లారెడ్డిగూడెం నుంచి చెర్వుగట్టు వరకు డబుల్ రోడ్లను వేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నూతన ధర్మకర్తలను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, యానాల అశోక్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గంట నర్సిరెడ్డి, బాజ యాదయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్