పల్లెల్లో అభివృద్ధికి ప్రభుత్వం కృషి

- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
- పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
దేవరకొండ రూరల్, జనవరి 2: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని పెద్దతండా, శేరిపల్లి గ్రామాల్లో రూ.16 లక్షలతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి మాట్లాడారు. మండలంలోని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాననన్నారు. అనంతరం గ్రామాల్లో చెత్త బుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, సర్పంచులు పద్మాతుల్చనాయక్, సత్తయ్య, ఎంపీడీఓ పాండు, ఎంపీటీసీ నర్సింహ, మాజీ ఎంపీటీసీ ఖిష్టునాయక్, శంకర్, భానుప్రకాశ్ పాల్గొన్నారు.
బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
కొండమల్లేపల్లి, జనవరి 2 : మండలంలోని వర్ధమానుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పీల్యా తండాలో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.1.75 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శనివారం శంకుస్థాపన చేశారు. ఎంపీపీ దూదిపాల రేఖ, సర్పంచ్ శంకర్, పీఏసీఎస్ చైర్మన్ వేణుధర్‌రెడ్డి, ఎంపీటీసీ రజిత, కుంభం శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మేకల శ్రీను, పసునూరు యుగేంధర్ రెడ్డి, అబ్బనబోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15,388 కొవిడ్ కేసులు
- రైతు ఆందోళనలపై బ్రిటన్ ఎంపీల చర్చ.. ఖండించిన భారత్
- అమ్మమ్మ మాదిరిగా హావభావాలు పలికించిన సితార- వీడియో
- అభివృద్ధిని చూసి ఓటెయ్యండి : ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- మహిళను ముక్కముక్కలుగా నరికేశారు..
- తొమ్మిదికి పెరిగిన మృతులు.. ప్రధాని సంతాపం
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్‌తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్