సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Jan 03, 2021 , 00:47:21

పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తాం

పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తాం

మునుగోడు, జనవరి 2 : రాష్ట్ర ప్రభుత్వం మం డల పరిషత్‌కు మంజూరు చేసే నిధులతో సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు కృషిచేస్తానని ఎంపీపీ కర్నాటి స్వామి అన్నారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో పీఆర్టీయూ 2021 క్యాలెండర్‌ను ఆయ న ఆవిష్కరించి మాట్లాడారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్‌, మండలాధ్యక్షుడు యూసుఫ్‌పాషా, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌గౌడ్‌, మోహన్‌రావు, వెంకన్న, ఓగోటి శంకర్‌, రవీందర్‌రెడ్డి, సత్తిరెడ్డి, చంద్రం, నర్సింహ, విజయ్‌భాస్కర్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo