నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కారం

- ‘ధరణి’ సమస్యలపై స్పెషల్ ఫోకస్
- మిగిలి ఉన్న అంశాలపై చర్యలు.. సీఎం దృష్టికి క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్
- త్వరలోనే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు
- పల్లె, పట్టణ ప్రగతిలకు అధిక ప్రాధాన్యత
- కొత్త ఏడాదిపై ‘నమస్తే’తో నల్లగొండ
- కలెక్టర్ పీజే పాటిల్
నల్లగొండ, జనవరి1(నమస్తే తెలంగాణ-ప్రతినిధి) : “నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు నిర్ణీత కాలవ్యవధితో పనిచేయాలన్న సంకల్పంతో ఉన్నాం. అన్ని రకాల ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నాం. ఇప్పటికే చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరింత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం. వీటికి తోడు రెవెన్యూలో నూతన శకానికి శ్రీకారం చుడుతూ ప్రభుత్వం తీసుకొవచ్చిన ధరణి సేవలను మరింత విస్తృతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం అవుతుంది.’ అని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ ఈ ఏడాదిలో జిల్లా అధికార యంత్రాంగం ఎంచుకున్న ప్రాధాన్యతల గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ఇప్పటికే పల్లె, పట్టణ ప్రగతి పేరుతో వేర్వేరు కార్యక్రమాలు చేపడుతున్నది. వీటి కోసం క్రమం తప్పకుండా నిధులను విడుదల చేస్తూ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టింది. అన్ని చోట్ల మౌలిక వసతులపై దృష్టి పెట్టింది. గ్రామాల్లో పచ్చదనం పెంపుకోసం పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నది. దీన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం. రైతు వేదికలు, వైకుంఠధామాల నిర్మాణం, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ ఏడాది ఆరంభంలోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేశాం. ధరణి పోర్టల్‌లో ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు విజయవంతంగా సాగుతున్నాయి. అయితే వీటితో పాటు ఇంకా మిగిలిన అంశాలకు కూడా త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గురువారం సీఎం కేసీఆర్ నాతో పాటు మరో నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. నల్లగొండ జిల్లా నుంచి క్షేత్రస్థాయిలో ధరణి స్పందనపై ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఇంకా చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించారు. ధరణి ద్వారా అతి త్వరలోనే పెండింగ్ మ్యూటేషన్లకు క్లియరెన్స్ రానుంది. కలెక్టర్ల నేతృత్వంలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి వివిధ రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపనున్నారు. సాదాబైనామాలకు కూడా క్లియరెన్స్ ఇస్తూ పాస్ పుస్తకాల్లో ఎక్కించేందుకు త్వరలోనే ఆదేశాలు రానున్నాయి. పార్ట్ -బీలో మిగిలి ఉన్న భూ సమస్యలకు సాధ్యమైనంత వేగంగా పరిష్కారం చూపే దిశగా కూడా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. దీనిపై తుది మార్గదర్శకాలు రావాల్సి ఉన్నాయి. మిగిలి ఉన్న అన్ని అంశాలపై వారం, పది రోజుల్లో స్పష్టమైన రోడ్‌మ్యాప్ వస్తుందని భావిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా అన్ని రకాల భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించనుది. ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా నూతన సంవత్సరంలో మరింత సంకల్పసిద్ధితో సేవలు అందిస్తాం.. అని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వివరించారు. ఇంకా వీటితో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తామని, అందుకు జిల్లాలోని అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడూ సన్నద్ధం చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
- పోస్ట్‌మార్టమ్‌కు ముందు మృతదేహంలో కదలిక
- ఈ టీ తాగితే దగ్గు చిటికెలో మాయం
- ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు చేయండి
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!