భవితకు ‘భరోసా’..

- విద్యార్థుల రవాణా, ఎస్కార్ట్, స్కాలర్షిప్ వేతనాలు విడుదల
- ఉమ్మడి జిల్లాకు 1.34 కోట్లు
- కరోనా వేళ విద్యార్థులకు అండగా నిలిచిన సర్కార్
రెండురోజుల్లో విద్యార్థుల బ్యాంకు ఖాతాలోకి నగదు జమరామగిరి, జనవరి1 : దివ్యాంగ విద్యార్థులకు ఆటపాటలు, ఫిజియోథెరపీ, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూనే ఆర్థిక భరోసా కల్పించే భవిత కేంద్రాలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తున్నది. ప్రతి సంవత్సరం రవాణా, ఎస్కార్ట్(సహాయకుల) భత్యంతోపాటు బాలికలకు స్కాలర్షిప్ అందిస్తున్నది. కరోనా వేళలోనూ ఉమ్మడి జిల్లాకు రూ.1.34 కోట్లు విడుదల చేసింది.
రామగిరి, జనవరి1 : దివ్యాంగ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిత కేంద్రాలను నిర్వహిస్తున్నది. ఈ కేంద్రాల్లో దివ్యాంగ విద్యార్థులకు విద్య, ఆట పాటలు, ఫిజియోథెరెపీ, వైద్య పరీక్షలు నిర్వహిస్తూనే సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. వీరికి ప్రతి సంవత్సరం రవాణా, ఎస్కార్ట్(సహాయకుల) భత్యంతోపాటు బాలికలకు స్కాలర్షిప్ (ఉపకారవేతనాలు)అందిస్తున్నది. ఈ నేపథ్యంలో 2018-19, 2019-20 విద్యా సంవత్సరాలకు ఆయా అంశాల్లోని విద్యార్థులకు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా రూ.కోటీ 34 లక్షల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. అయితే కరోనా వేళ ఆర్థ్ధిక ఇబ్బందులతో ఉన్న వారికి భరోసా కల్పించేలా నిధులు విడుదల చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ నిధులు రెండు, మూడు రోజుల్లో విద్యార్థుల బ్యాంకు ఖాతాలోకే జమ కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 111 భవిత కేంద్రాలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందించేందుకు సమగ్రశిక్ష (సమగ్ర శిక్ష అభియాన్)ద్వారా ఐఈఆర్టీ(ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్)ని నియమించింది. వీరు ఆయా పాఠశాలలోని పిల్లలకు పాఠశాలలతోపాటు అవసరమైతే వారి ఇంటికే వెళ్లి బోధిస్తారు. ఆటపాటలు, ఫిజియోథెరపీ, ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు. ఉమ్మడి జిల్లాలో 111 భవిత కేంద్రాల్లో 111 మంది ఐఈఆర్టీలు పనిచేస్తున్నారు.
చెల్లింపులు ఇలా ...
భవిత కేంద్రాలకు వచ్చేందుకు విద్యార్థులకు ప్రతి సంవత్సరం రవాణా చార్జీలతోపాటు స్కాలర్షిప్, సహాయకులకు(ఎస్కార్ట్ అలవెన్స్)ను అందిస్తున్నది. కాగా రవాణా చార్జీలు ప్రతి నెల రూ.350, సహాయకులకు రూ. 350 అందిస్తారు. అదే విధంగా సీడబ్ల్యూఎస్ఎన్(చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్) ప్రత్యేకావసరాలు గల బాలికలకు అదనంగా ప్రతి నెలా రూ.200 స్కాలర్షిప్ అందిస్తారు. ఈ నిధులను సంవత్సరంలో పనిదినాల(నెలల) ఆధారంగా అందిస్తారు. ఇందుకు సంబంధించి నల్లగొండ జిల్లాలో2019-20, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని విద్యార్థులకు 2018-19, 2019-20 విద్యా సంవత్సరాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
నేరుగా విద్యార్థుల ఖాతాలోకే నిధులు
భవిత కేంద్రం విద్యార్థులకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తాయి. దీనికి సంబంధించి రెండు, మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. కరోనా సమయంలో ఆర్థిక భరోసా కల్పించేలా విద్యార్థులకు ప్రభుత్వం వీటిని అందజేయడం హర్షణీయం.
- బి.భిక్షపతి, డీఈఓ, నల్లగొండ
తాజావార్తలు
- వెంకీ-మీనా ‘దృశ్యం 2’ షురూ అయింది
- కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచేది లేదు : ఇఫ్కో
- ఇంటి రుణంపై రూ.4.8 లక్షల ఆదా.. ఎలాగంటే..!
- రియల్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీవో
- కొత్త కారు కొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ధరెంతో తెలుసా?
- ఒకే ప్రాంతం..ఒకే రోజు.. 100 సఫారీలు డెలివరీ
- శివసేన నేతలతో ప్రాణ హాని : సుప్రీంకోర్టులో బాలీవుడ్ క్వీన్ పిటిషన్
- బరువు తగ్గాలా.. పచ్చి బఠానీ తినండి
- ఆ నగరంలో మాంసం.. గుడ్లు నిషేధం!..
- నేను ఐటెంగాళ్ ను కాదు: అనసూయ