రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి

- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
చందంపేట, డిసెంబర్ 31 : రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదిక, డంపింగ్ యార్డు, పాఠశాల అదనపు తరగతి భవనాల ప్రారంభంతోపాటు నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్‌లో 13 లక్షల చేప పిల్లలను వదిలారు. మండల కేంద్రంలో సుమారు రూ.30 లక్షలతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలోని దేవరకొండ, పెద్దమునిగల్, డిండి మండలాల్లో రూ. 10 లక్షలతో చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి చరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, ఎంపీపీలు బాణావత్ పద్మ, పార్వతి, జడ్పీటీసీలు కేతావత్ బాలూ నాయక్, పవిత్ర, వైస్ ఎంపీపీ ముత్యాలమ్మ, రైతు బంధు సమితి మండల కన్వీనర్ కృష్ణయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, లక్ష్మానాయక్, ఎంపీటీసీలు బిక్కు నాయక్, శ్రీనివాస్ గౌడ్, సర్పంచులు కవితాఅనంతగిరి, మల్లారెడ్డి, బావోజీ, అంజయ్య, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, ఎంపీడీఓ రాములు నాయక్, ఎంఈఓ సామ్య నాయక్, శంకర్‌నాయక్, బొడ్డుపల్లి కృష్ణ, సాధిక్, సోను, ఏఓ మల్లారెడ్డి, ప్రధానోపాధ్యాయులు జగన్, రవీందర్ నాయక్, బాలూనాయక్ పాల్గొన్నారు.
దేవాలయంలో పూజలు
నేరేడుగొమ్ము(చందంపేట) డిసెంబర్ 31: వైజాగ్ కాలనీ ఆంజనేయస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పూజలు నిర్వహించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, ఎంపీపీ పద్మ, జడ్పీటీసీ బాలూనాయక్, వైస్ ఎంపీపీ ముత్యాలమ్మ, కృష్ణయ్య ఉన్నారు.
క్యాలెండర్ ఆవిష్కరణ
దేవరకొండ : స్పోర్ట్స్ఆసోసియేషన్ 2021 క్యాలెండర్‌ను ఎమ్మెల్యే రవీంద్రకుమార్ గురువారం స్పోర్ట్స్ భవన్లో ఆవిష్కరించారు. తాళ్ల శ్రీధర్‌గౌడ్, కృష్ణకిశోర్, సురేశ్, క్రాంతి, లావణ్య, ప్రవీణ, రాక్‌స్టార్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.