బుధవారం 03 మార్చి 2021
Nalgonda - Dec 31, 2020 , 00:08:29

ఎత్తిపోతలను ఏడాదిలో పూర్తి చేస్తాం

ఎత్తిపోతలను ఏడాదిలో పూర్తి చేస్తాం

  • ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు

దామరచర్ల : మండలానికి మంజూరైన ఎత్తిపోతల పథకాలను ఏడాదిలోగా పూర్తిచేసి సాగుకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లోని బొత్తలపాలెం-వాడపల్లి, అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి- చాంప్లాతండా ఎత్తిపోతల పథకాల ప్రదేశాలను ఎన్‌ఎస్పీ అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. లిఫ్ట్‌ల పరిధిలో చెరువులను నింపేందుకు, ఆయకట్టు స్థిరీకరణ, నీటి డిజైన్లపై రైతులు, ప్రజాప్రతినిధులు, ఎన్‌ఎస్పీ అధికార్లతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు మండలాల్లో మూడు ఎత్తిపోతలకు రూ. 525.08 కోట్లు విడుదలైనట్లు చెప్పారు. ఉమ్మడి మండలంలో 27,095 ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. జనవరి 30నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. కేశవాపురం ఎత్తిపోతల పథకం టెండర్‌ పూర్తయ్యిందని తెలిపారు. ఎత్తిపోతల నిర్మాణాలకు రైతులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి, స్కైలాబ్‌నాయక్‌, ఎండీ యూసూఫ్‌, సోము సైదిరెడ్డి, కోటిరెడ్డి, అడవిదేవులపల్లి ఎంపీపీ బాలూనాయక్‌, జడ్పీటీసీ కుర్ర సేవానాయక్‌, ఎన్‌ఎస్పీ ఆపరేషన్‌, మెయింటెనన్స్‌ శాఖ ఎస్‌ఈ విజయ్‌భాస్కర్‌, ఈఈ పీ రాము, డీఈలు వెంకట్రామ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo