శుక్రవారం 05 మార్చి 2021
Nalgonda - Dec 31, 2020 , 00:07:32

2021లో ‘బ్రాహ్మణ వెల్లెంల’ పూర్తి

2021లో ‘బ్రాహ్మణ వెల్లెంల’ పూర్తి

  • ప్రాజెక్ట్‌ పనుల వేగవంతంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి
  • జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి

నార్కట్‌పల్లి : బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు నిర్మాణ పనుల వేగవంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని, 2021లో ప్రాజెక్టు పూర్తయి లక్ష ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి అన్నారు. బుధవారం నార్కట్‌పల్లిలోని శబరి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలను పూర్తి చేసేందుకు నిధులు కావాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సీఎం కేసీఆర్‌ను కోరినట్లు తెలిపారు. స్పందించిన సీఎం కేసీఆర్‌ వెంటనే అధికారులను ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ఆదేశించడం హర్షణీయమని అన్నారు. భూ సేకరణ, టన్నెల్‌ లైనింగ్‌ నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో విడుతల వారీగా నిధులు మంజూరు చేయించుకొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అని, కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు. సమావేశంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్‌ యానాల అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సర్పంచ్‌ దూదిమెట్ల స్రవంతి, గంట్ల నర్సిరెడ్డి, ఎంపీటీసీలు మేకల రాజిరెడ్డి, పుల్లెంల ముత్తయ్య, చిరుమర్తి యాదయ్య, పీఏసీఎస్‌ చైర్మన్లు నర్సిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, దోసపాటి విష్ణుమూర్తి, చిట్యాల మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కొండూరి శంకర్‌, బద్దం రాంరెడ్డి, దుబ్బాక శ్రీధర్‌, సత్తిరెడ్డి, మేడి శంకర్‌, పసునూరి శ్రీను, మేకల కరుణాకర్‌రెడ్డి, కన్నెబోయిన సైదులు, బొబ్బలి దేవేందర్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo