విశేషాలు విషాదాలు 2020

.. ఈ అనంత కాల గమనంలో
చూస్తుండగానే మరో యేడు గడిచింది. కరోనా సమయంలో కాలచక్రం గిర్రున తిరిగింది. 20 20 మ్యాచ్‌లా 2020 సంవత్సరం కూడా వేగంగా, ఉత్కంఠగా సాగింది. ఏడాది జీవన పయనంలో కొన్ని విశేషాలు పలుకరించాయి. మరికొన్ని విషాదాలు కలిచివేశాయి. తల్లినేల కోసం కర్నల్ సంతోష్‌బాబు యుద్ధభూమిలో వీర మరణం పొందితే.. ఉమ్మడి జిల్లా నుంచి మరో నలుగురు యువతీయువకులు సివిల్స్‌కు ఎంపికై సేవకు సైనికుల్లా కదిలారు. ముక్కుపచ్చలారని ముగ్గురు బాలికలను బలిదీసుకున్న సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డికి న్యాయదేవత మరణ శాసనం రాస్తే.. కూతురు ప్రేమించిన వ్యక్తిని నడిరోడ్డుపై హతమార్చిన మారుతీరావు తనకుతానుగా మరణ శిక్ష విధించుకున్నాడు. ప్రజా గొంతుక నోముల అందరికీ దూరంగా మౌనముద్రలోకి వెళ్లిపోయాడు. కరోనా ఆపత్కాలంలోనూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాలకు సర్కారు అండగా నిలిచింది. ఆధ్యాత్మిక ప్రభకు అద్దం పట్టేలా యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయం పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది.
- 2020 మ్యాచ్‌లానే గడిచిపోయిన సంవత్సరం
- కరోనా టైమ్‌లో గిర్రున తిరిగిన కాలచక్రం
- విపత్తులోనూ ఆగని అభివృద్ధి, సంక్షేమం
- సరిహద్దులో నేలకొరిగిన కర్నల్ సంతోష్‌బాబు
- సివిల్స్‌లో సత్తాచాటిన నలుగురు యువతీయువకులు
- మూగబోయిన ప్రజా గొంతుక ఎమ్మెల్యే నోముల
- తుది దశకు యాదాద్రి దేవస్థానం పునర్నిర్మాణం
- ప్రతిష్టాత్మక ఎయిమ్స్ సేవలు అందుబాటులోకి..
- ఉమ్మడి జిల్లాకు 3సార్లు వచ్చిన సీఎం కేసీఆర్
ఒక త్యాగం జన్మభూమి రుణం తీర్చుకున్నది మరొక విజయం దేశసేవకు సిద్ధమైందిఒక తీర్పు న్యాయాన్ని గెలిపించింది మరొక నిర్ణయం విషాదాంతానికి సాక్షీభూతమైందివిపత్తులోనూ సర్కారు అడుగు అభివృద్ధివైపే పడిందిఆధ్మాత్మిక శోభ, వైజ్ఞానిక ఖ్యాతి ప్రభవిల్లింది.2020 మ్యాచ్‌లానే గడిచిన సంవత్సరంకరోనా టైమ్‌లో గిర్రున తిరిగిన కాలచక్రంలాక్డౌన్తో ఇండ్లకే పరిమితమైన ప్రజలు యాసంగిలో రైతులను ఆదుకున్న సర్కారు ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేసిన ప్రభుత్వం కరోనా వేళ ప్రజా సంక్షేమానికి పెద్దపీట ‘సివిల్స్'లో సత్తా చాటిన నలుగురు అభ్యర్థులుసరిహద్దులో నేలకొరిగిన కర్నల్ సంతోష్బాబుకన్నుమూసిన ప్రజల గొంతుక ఎమ్మెల్యే నోముల కరోనా మహమ్మారి ఈ ఏడాదిని మింగేసింది. ఆరంభంలో మూడు నెలల పాటు సాధారణ పరిస్థితులే నెలకొన్నా.. మార్చి నెలాఖరులో ప్రారంభమైన లాక్డౌన్ కారణంగా సుమారు ఏడు నెలల పాటు జనజీవనం స్తంభించింది. తొలి త్రైమాసికంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టిన సర్కారు.. నిధులు సైతం భారీగా విడుదల చేసింది. కరోనా కష్టకాలంలోనూ యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతిగింజనూ కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నది. ఇక ప్రజా సంక్షేమం దిశగా రేషన్ బియ్యం ఉచితంగా అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కిరాణా వస్తువుల కొనుగోళ్లకు మూడు నెలలు రూ.1500బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, లాక్డౌన్, డిసెంబర్ అన్నట్లుగా శరవేగంగా గడిచిపోయింది. సరిహద్దులో చైనా బలగాల దాడిలో సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు వీరమరణం పొందగా.. ప్రశ్నించే ప్రజల గొంతుకగా పేరొందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల హఠాన్మరణం పాలయ్యారు. వెరసి కాలగమనంలో మరో ఏడాది ముగిసిపోయింది.
అభివృద్ధిలో మైలురాళ్లు.. మేలైన ఫలితాలు..జూన్ 29...
హుజుర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తానని ఉప ఎన్నికల్లో ప్రకటించిన మంత్రి కేటీఆర్.. ఆర్నెళ్లు తిరక్కుండానే ఆ హామీని నెరవేర్చారు. అదనంగా హుజుర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు రూ.40కోట్లు కేటాయించారు. నల్లగొండ, మిర్యాలగూడ, చిట్యాల మున్సిపాలిటీల్లోనూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఆగస్టు 4...
సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు సత్తాచాటారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావికి చెందిన ధాత్రిరెడ్డి 46, తంగడపల్లికి చెందిన సత్యప్రకాశ్ 218, హుజూర్‌నగర్‌కు చెందిన పిన్నాని సందీప్ కుమార్ 244, నల్లగొండకు చెందిన రేనుకుంట్ల శీతల్ కుమార్ 417ర్యాంకులతో పలువురి మన్ననలు పొందారు.
కలిసొచ్చిన యాసంగి.. ఆగస్టు 6...
రైతు సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఈ ఏడాది యాసంగి, వానకాలంలో నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ ఆయకట్టుకు నీటిని విడుదల చేసింది. గత యాసంగిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 13.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రికార్డు నమోదు చేసింది. ఈ వానకాలం సీజన్లో అధిక వర్షాల కారణంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం యాసంగికి ఆన్‌అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు.
విషాదం నింపిన రోడ్డు ప్రమాదాలు... ఫిబ్రవరి 13
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురానికి చెందిన ఊదరి భిక్షపతి, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిన్నారెడ్డిగూడేనికి చెందిన గ్యార నర్సయ్య అనే వియ్యంకులు చిట్యాలలో వివాహానికి హాజరై రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
ఫిబ్రవరి 22
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం వెల్లంకి ఈదులచెరువులో కారు కడుగడానికి వెళ్లిన సర్నేనిగూడెం సర్పంచ్ భర్త ధర్నె మధుతో పాటు ఆయన కుమారుడు మణికంఠ, స్నేహితుడు శ్రీధర్‌రెడ్డి చెరువులో విగత జీవులయ్యారు.
ఫిబ్రవరి 27...
పీఏ మండలంలోని వడ్డెరగూడెం సమీపంలో ఏఎమ్మార్పీ కాల్వలోకి కారు కాల్వలోకి దూసుకెళ్లగా ఓర్సు రంగయ్య, ఆయన భార్య, అలివేలు, కూతురు కీర్తి మృతి చెందారు. స్థానికులు అప్రమత్తమై ఆయన కుమారుడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
ఫిబ్రవరి 6...
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ ఘటన రాష్ర్టాన్నే కుదిపేసింది. సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు మైనర్ బాలికలపై లైంగికదాడికి పాల్పడి హతమార్చాడు. నల్లగొండ ఫోక్సో కోర్టు 101మంది సాక్షులను విచారించి రెండు కేసుల్లో మరణ శిక్ష, మరో కేసులో యావజ్జీవ శిక్ష విధించింది.
కర్నల్ కుటుంబానికి అండగా..
సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు భారత్ - చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందారు. సైన్యంలో ఉద్యోగం యువతకు స్ఫూర్తిదాయకం కావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సంతోష్కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచింది. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించింది. ఎవ్వరూ ఊహించని రూ.4కోట్ల ఆర్థిక సాయం అందించింది. సీఎం కేసీఆర్ స్వయంగా సంతోష్‌బాబు ఇంటికి వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. హైదరాబాద్‌లో రూ.20కోట్ల విలువైన స్థలం, సంతోష్‌బాబు సతీమణికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కల్పించారు. 2020సంవత్సరం అన్ని రంగాల్లోనూ ప్రభావం చూపింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రత్యేక ముద్ర వేసింది. ప్రజలంతా సుమారు ఏడు నెలల పాటు పూర్తిగా ఇంటికే పరిమితం కాగా.. మారిన జీవనశైలి కొత్త పాఠం నేర్పింది. లాక్డౌన్ కారణంగా నేరాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గినప్పటికీ పలువురు ప్రముఖులు కన్నుమూశారు. మొత్తంగా ఈ ఏడాది ఆసాంతం ‘కరోనా నామ వత్సరం’గా మిగిలిపోయింది.
ఏప్రిల్ 2...
ఢిల్లీలో మతప్రార్థనలకు హాజరైన జిల్లావాసుల్లో ఆరుగురు కొవిడ్ బారిన పడ్డారు. వైరస్ వారి నుంచి క్రమంగా విస్తరించడంతో ఇప్పటి వరకు 20,400మంది కరోనా బాధితులుగా మిగిలారు. తుంగతుర్తి మండలం కర్విరాల గ్రామంలోని వెలుగు శ్రీనివాస్ కరోనా భయంతో ఆత్మహత్యకు పాల్పడగా.. మరో 74మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా కట్టడి దిశగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి బాధితులకు భరోసా కల్పించింది.
వాసాలమర్రికి మహర్దశ...
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ ఈ ఏడాది నవంబర్ 1న ప్రకటించారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించింది. గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ఆరా తీసింది. సంక్షేమ పథకాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి బ్లూప్రింట్ సిద్ధమైంది.
నోముల మృతి..
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హైదరాబాద్‌లో గుండెనొప్పితో కన్నుమూశారు. నకిరేకల్ మండలం పాలెంలో జరిగిన అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొని నివాళులర్పించారు. అంతకుముందు ఎమ్మెల్యే తనను హైదరాబాద్‌లో కలిసి విజ్ఞప్తి చేసిన మేరకు హాలియాకు డిగ్రీ కళాశాలను మంజూరు చేశారు. టెయిలెండ్ భూములకు జీవం పోసే ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తూ రూ.515కోట్లు కేటాయించారు.
యాదాద్రి గొప్ప నిర్మాణం...
యాదాద్రి ఆలయం వెయ్యేండ్లపాటు నిలవాల్సిన గొప్ప నిర్మాణం. సంప్రదాయ, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ తొందరపాటు లేకుండా ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేయాలి. ఆలయం బంగారు, వెండి కాంతులీనాలి. కాళేశ్వరం నీటితో గండి చెరువును నింపండి. రింగురోడ్డు యాదాద్రికి మణిహారంలా ఉండాలి.
- ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు
ట్విట్టర్ వేదికగా..
ఆగస్టు 1 : ఆత్మకూరు(ఎం) మండలకేంద్రంలోని గట్టుసత్తయ్య, అనూరాధ అనారోగ్యంతో మృతి చెందగా.. వారి పిల్లలు మనోహర్, యశ్వంత్, లాస్య అనాథలయ్యారు. ఇది తెలిసి నటుడు సోనుసూద్ చిన్నారులను దత్తత తీసుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఆ మరుసటి రోజే మంత్రి కేటీఆర్, సినీనిర్మాత దిల్‌రాజు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సైతం స్పందించి పిల్లల చదువు బాధ్యతలను తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
మార్చి 26...
లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన పేదల పొట్టనింపడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 7,74,243రేషన్ కార్డులు ఉండగా 23,28,089 మంది లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. ఎనిమిది నెలల పాటు ఉచిత రేషన్ అమలుతో పాటు మూడు నెలల పాటు ప్రతి కార్డుదారుడికి రూ.1500చొప్పున రూ.116.13కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది.
కర్నల్ కుటుంబానికి అండగా..
సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు భారత్ - చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందారు. సైన్యంలో ఉద్యోగం యువతకు స్ఫూర్తిదాయకం కావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సంతోష్కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచింది. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరిపించింది. ఎవ్వరూ ఊహించని రూ.4కోట్ల ఆర్థిక సాయం అందించింది. సీఎం కేసీఆర్ స్వయంగా సంతోష్‌బాబు ఇంటికి వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. హైదరాబాద్‌లో రూ.20కోట్ల విలువైన స్థలం, సంతోష్‌బాబు సతీమణికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కల్పించారు.
తాజావార్తలు
- వ్యాపారుల కోసం రూపే సాఫ్ట్ పీఓఎస్
- రైడింగ్ మోడ్స్‌తో సరికొత్త అపాచీ
- సీఐఐ తెలంగాణ చైర్మన్‌గా సమీర్ గోయల్
- మొక్కను తొలగించిన ఇద్దరికి జరిమానా
- టీవీ ధరలకు రెక్కలు!
- పంత్ పవర్
- ముత్తూట్ చైర్మన్ కన్నుమూత
- సెహ్వాగ్ 35 బంతుల్లో 80 నాటౌట్
- మంత్రి కొప్పులను కలిసిన గద్దర్
- ఈ-కొలి బ్యాక్టీరియాతో క్యాన్సర్..!