శనివారం 27 ఫిబ్రవరి 2021
Nalgonda - Dec 30, 2020 , 01:52:26

రాగ్యానాయక్‌ సేవలు మరువలేనివి

రాగ్యానాయక్‌ సేవలు మరువలేనివి

  • ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు

మిర్యాలగూడ : గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి మాజీ ఎమ్మెల్యే ధీరావత్‌ రాగ్యానాయక్‌ ఎనలేని సేవలు చేశారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం రాగ్యానాయక్‌ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాగ్యానాయక్‌ అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.  మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, మాజీ ఎమ్మెల్సీ ధీరావత్‌ భారతీ రాగ్యానాయక్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్‌ రామ్‌ చందర్‌  నాయక్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ దుర్గంపూడి నారాయణరెడ్డి, కుర్ర విష్ణు, స్కైలాబ్‌నాయక్‌, మేగ్యానాయక్‌, నూకల హనుమంతరెడ్డి, బాలాజీనాయక్‌, తాళ్లపల్లి రవి, శోయబ్‌ పాల్గొన్నారు.

మండలాల్లో వర్ధంతి కార్యక్రమాలు..

హాలియా : రాగ్యానాయక్‌ 19వ వర్ధంతిని మంగళవారం హాలియాలో గిరిజన, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు రమావత్‌ శంకర్‌నాయక్‌, బాబూరావునాయక్‌, తిరుమలగిరి సాగర్‌ ఎంపీపీ అంగోతు భగవాన్‌నాయక్‌, డాక్టర్‌ రవినాయక్‌, సపావత్‌ పాండునాయక్‌, మోహన్‌నాయక్‌, సక్రునాయక్‌, ప్రసాద్‌ నాయక్‌, దత్తు నాయక్‌, శేఖర్‌రెడ్డి, వెంపటి శ్రీనివాస్‌, చైతన్య, మంగ్తనాయక్‌, బందిలాల్‌, సర్ధార్‌ నాయక్‌, మోతీలాల్‌నాయక్‌ పాల్గొన్నారు. 

గుర్రంపోడు : మండల కేంద్రంలో నిర్వహించిన వర్ధంతిలో కంచర్ల వెంకట్‌రెడ్డి, శివాజీ శర్మ, కొత్త నాగరాజు, కుప్ప ఎల్లేశ్‌, చాడ మల్లేశ్‌, కుప్ప మహేశ్‌, షేక్‌ ఇర్ఫాన్‌ పాల్గొన్నారు.

త్రిపురారం : మండల కేంద్రంలో నిర్వహించిన వర్ధంతిలో జడ్పీటీసీ భారతి, భాస్కర్‌నాయక్‌, ధనావత్‌ ధన్‌సింగ్‌నాయక్‌, త్రిపురారం సర్పంచ్‌ శ్రీనివాసరెడ్డి, మర్ల చంద్రారెడ్డి, చిలుముల శ్రీను, కసిరెడ్డి నరేశ్‌, రాంచంద్రు, ఉషానాయక్‌, అనిల్‌, పాండు, జయరాంనాయక్‌, సునీల్‌నాయక్‌ పాల్గొన్నారు. 

నందికొండ : హిల్‌కాలనీ బస్టాండ్‌ కూడలిలో ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం టౌన్‌ అధ్యక్షుడు రమావత్‌ మోహన్‌ నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతిలో ఎంపీపీ భగవాన్‌ నాయక్‌, కౌన్సిలర్‌ మంగ్తానాయక్‌, బనావత్‌ చందులాల్‌ నాయక్‌, చంద్రమౌళినాయక్‌, ఆర్బీనాయక్‌, బాలాజీనాయక్‌, ఆదాసు విక్రమ్‌, దినేశ్‌నాయక్‌ పాల్గొన్నారు.

పెద్దవూర : మండల కేంద్రంలో ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జటవత్‌ రవినాయక్‌, నాయకులు శివాజీ, శ్రీకర్‌నాయక్‌, బలవర్ధిరాజు, సురేశ్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo