రైతు బాంధవుడికి క్షీరాభిషేకం

- యాసంగికి పంట పెట్టుబడి విడుదలవడంతో ఉమ్మడి జిల్లా రైతులు సోమవారం సంబురాలు చేసుకున్నారు. పలుచోట్ల ముఖ్యమంత్రి
- కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. పెద్దవూరలో జరిగిన
- కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు
- రాంచందర్‌నాయక్ పాల్గొన్నారు.
త్రిపురారం/ పెద్దవూర/ మద్దిరాల : యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద సోమవారం డబ్బులు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. త్రిపురారంలో టీఆర్ఎస్ యువజన నాయకుడు నోముల భగత్, సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి, మార్కెట్ చైర్మన్ జానయ్య, పీఏసీఎస్ చైర్మన్ జయరాంనాయక్, మర్ల చంద్రారెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్, రామచంద్రయ్య పాల్గొన్నారు. పెద్దవూరలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రూ.10 వేల పెట్టుబడి సాయం అందించడం అదృష్టమన్నారు. కార్యక్రమంలో పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు జటవత్ రవినాయక్, లింగారెడ్డి, కిషన్‌నాయక్, కృష్ణారావు, కర్ణ బ్రహ్మారెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. మద్దిరాలలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ ఎస్ఏ రజాక్, వైస్ ఎంపీపీ శ్రీరాంరెడ్డి, జడ్పీటీసీ సురాంబ, కుందూరు విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్, సాహెబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.