ఈనెల 31న హ్యాపీగా.. జాలిగా..

- ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక లాంచీ
- సాగర్ టు శ్రీశైలం ట్రిప్
- పర్యాటకశాఖ ఏర్పాట్లు
నందికొండ : సంవత్సరాంతంలో జాలీగా గడుపుతూ.. కొత్త అనుభూతి కోరుకునే వారికి రాష్ట్ర పర్యాటక శాఖ ఎర్ర తివాచీ పరిచింది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి డిసెంబర్ 31న ప్రత్యేక లాంచీని నడుపనుంది. రెండ్రోజులపాటు కృష్ణమ్మ సవ్వడుల నడుమ సాగే ఈ ప్రయాణంలో జలపాతాల అందాలు, మురిపించే జింకలు, దుప్పుల విన్యాసాలు, నదికి ఇరువైపులా నల్లమల కొండలు, వాటిపై చారిత్రక ఆనవాళ్లు కనువిందు చేస్తాయి. ప్రతి వారాంతంలో ఉండే శ్రీశైలం ప్రయాణానికి అదనంగా ప్రకృతి ప్రేమికులు కొత్త సంవత్సరం మధురానుభూతులను ఆస్వాదించేందుకు ప్రత్యేక లాంచీని ఏర్పాటు చేశారు.
టికెట్ ధరలు..
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు బస్సు ప్రయాణం, శ్రీశైలంలో దర్శనం అనంతరం మరుసటిరోజు శ్రీశైలం నుంచి నందికొండకు లాంచీలో ప్రయాణం, ఇక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వెళ్లేందుకు రూ.3500 పెద్దలకు, పిల్లలకు రూ.2800 చార్జ్ చేయనున్నారు. అదేవిధంగా నందికొండ నుంచి శ్రీశైలానికి లాంచీలో పోయి రావడానికి రూ.2000 పెద్దలకు, రూ.1600 పిల్లలకు, నందికొండ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు లేదా శ్రీశైలం నుంచి నందికొండకు రావడానికి కేవలం ఒకవైపునకు పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.800 చార్జ్ చేయనున్నారు.
అన్ని వసతులు కల్పించాం..
రెండ్రోజులపాటు సాగే శ్రీశైలం లాంచీ ప్రయాణంలో పర్యాటకులకు పూర్తి భద్రతతోపాటు, సకల వసతులను వివిధ ప్యాకేజీల్లో కల్పిస్తున్నాం. శ్రీశైలంకు టికెట్లను www.tstdc.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
వివరాలకు 7997951023 ఫోన్నెంబర్లో సంప్రదించవచ్చు.
- హరిబాబు, లాంచీ స్టేషన్ మేనేజర్
తాజావార్తలు
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి