బుధవారం 03 మార్చి 2021
Nalgonda - Dec 29, 2020 , 01:43:40

నందికొండ అభివృద్ధికి కార్యచరణ రూపొందించాలి

నందికొండ అభివృద్ధికి కార్యచరణ రూపొందించాలి

  • నల్లగొండ అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

నందికొండ : నందికొండ మున్సిపాలిటీ పరిధిలో సమస్యలను పరిష్కరించే దిశగా కార్యచరణ చేపట్టాలని నల్లగొండ అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. నందికొండ మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం కౌన్సిలర్లు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికంగా ఉన్న సమస్యలను కౌన్సిలర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాథమికంగా రోడ్డు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ పనులపై దృష్టి పెట్టి మున్సిపాలిటీ నిధులను సద్వినియోగం చేయాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. కమిషనర్‌ పల్లారావు మాట్లాడుతూ సమావేశంలో మొత్తం 38 అంశాల్లో 32 ఆమోదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ కర్న అనుషారెడ్డి, వైస్‌ చైర్మన్‌ మంద రఘువీర్‌,  కౌన్సిలర్లు నిమ్మల ఇందిరా, రమేశ్‌జీ, నంద్యాల శ్వేత, నాగరాణి,నాగశిరీష, మంగ్తా  పాల్గొన్నారు.  

 ప్రభుత్వ దవాఖాన తనిఖీ

 హిల్‌కాలనీ కమలా నెహ్రూ ఏరియా దవాఖానను  అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సోమవారం సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  వార్డులు, ఆపరేషన్‌ గదులు, దవాఖాన పరిసరాలు, రోగులకు, డాక్టర్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విధులో ఉన్న డాక్టర్లు, నర్సులు రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఎంఓ డాక్టర్‌ భానుప్రసాద్‌  తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo