ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Nalgonda - Dec 29, 2020 , 01:43:42

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

  •  ఎస్పీలు రంగనాథ్‌, భాస్కరన్‌

నల్లగొండ క్రైం/ సూర్యాపేట సిటీ : పెండింగ్‌ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నల్లగొండ ఎస్పీ రంగనాథ్‌, సూర్యాపేట ఎస్పీ భాస్కరన్‌ అన్నారు. సోమవారం కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి నేరాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు న్యాయమూర్తులతో చర్చించి కేసుల పురోగతి, విచారణ విషయాల్లో అధికారులంతా చురుకుగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నల్లగొండలో అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, రమాణారెడ్డి, సీఐలు రవీందర్‌, ఆదిరెడ్డి పాల్గొనగా, సూర్యాపేటలో       డీఎస్పీలు మోహన్‌కుమార్‌, రఘు, డీసీఆర్‌బీ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు, కమ్యూనికేషన్‌, ఐటీ సెల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

VIDEOS

logo