బుధవారం 03 మార్చి 2021
Nalgonda - Dec 28, 2020 , 01:21:06

31న శ్రీశైలానికి ప్రత్యేక లాంచీ

31న శ్రీశైలానికి ప్రత్యేక లాంచీ

  • కొత్త సంవత్సరం సందర్భంగా ఏర్పాటు 

నందికొండ : ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నందికొండను ఆదివారం పర్యాటకులు సందర్శించడంతో సందడి వాతావరణం నెలకొన్నది. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో జాలీ ట్రిప్పులకు పర్యాటకులు ఉత్సాహం కనబరిచారు. కృష్ణానదిలో డ్యాం సమీపం నుంచి చూస్తూ, చుట్టూ సహజ అడవుల అంచు నుంచి గంట సేపు కొనసాగిన లాంచీలో జాలీ ట్రిప్పు  ప్రయాణం ఆహ్లాదంగా ఉందని పర్యాటకులు తెలిపారు. శ్రీపర్వతారామం (బుద్ధ్దవనం), డ్యాం పరిసరాల్లో పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొన్నది. హిల్‌కాలనీ లాంచీస్టేషన్‌ నుంచి 4 జాలీ ట్రిప్పులు నడిపామని, రూ.50 వేల ఆదాయం వచ్చినట్లు లాంచీస్టేషన్‌ మేనేజర్‌ హరిబాబు తెలిపారు. అలాగే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం 31న  శ్రీశైలానికి ప్రత్యేక లాంచీని నడుపుతున్నట్లు చెప్పారు. ఈ లాంచీ  జనవరి 1న శ్రీశైలం నుంచి నందికొండకు చేరుకుంటుందన్నారు. ప్రతి శనివారం శ్రీశైలానికి యథావిధిగా కొనసాగుతుందన్నారు.

VIDEOS

logo