గురువారం 25 ఫిబ్రవరి 2021
Nalgonda - Dec 28, 2020 , 01:21:08

చారిత్రక పర్యాటక కేంద్రాన్ని సుందరీకరిస్తాం..

చారిత్రక పర్యాటక కేంద్రాన్ని సుందరీకరిస్తాం..

  • మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు పురపాలక సంఘంగా నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికలు తాగునీటి వ్యవస్థ పురపాలక సంఘానికి బదలాయింపు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డినందికొండ మున్సిపాలిటీలో సమీక్ష.. పట్టణంలో కాలి నడకన పర్య‘చారిత్రకపర్యాటకప్రాంతమైన నందికొండ పట్టణం గత ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడింది.. పక్కనే 200 టీఎంసీల నీరు ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి.. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఉన్నా చీకట్లోనే మగ్గింది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయంతో మున్సిపాలిటీగా మారింది.. ఇప్పుడు అభివృద్ధికి బాటలు పడ్డాయి.. తాగునీరు, విద్యుత్‌ సమస్యల్లేకుండా ప్రణాళిక రూపొందించాం.. ఆధునిక పద్ధతుల్లో వైకుంఠధామాలు, వాకింగ్‌ ట్రాక్‌లు నిర్మిస్తాం’ అని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నందికొండలో మున్సిపాలిటీ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో కాలినడకన పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. నందికొండను సుందరంగా మార్చుతామని ప్రకటించారు. 

హాలియా/ నాగార్జున సాగర్‌ : చారిత్రాత్మక పర్యాటక కేంద్రంగా బాసిల్లిన నందికొండను సుందరీకరిస్తామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. 60 సంవత్సరాలుగా లోకల్‌బాడీ లేకపోవడం వల్ల నందికొండ ఈ దుస్థితికి చేరిందన్నారు. సీఎం కేసీఆర్‌ గుర్తించి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారన్నారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఆర్డీఓ రోహిత్‌సింగ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కర్ణ అనూషారెడ్డి, కమిషనర్‌ చల్లారావుతో కలిసి పలు వార్డుల్లో పర్యటించి సమస్యలను పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలతోనే నందికొండ మున్సిపాలిటీగా రూపాంతరం చెందిందన్నారు. గతంలో పక్కన 200 టీఎంసీల నీరున్నా తాగునీటి ఎద్దడి ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి ఉన్నా నందికొండ ప్రజలు చీకట్లోనే మగ్గారని పేర్కొన్నారు. నందికొండ సుందరీకరణకు రూట్‌ మ్యాప్‌ సిద్ధమైందని, పరిపాలన అనుమతులు రాగానే పనులు మొదలు పెడ్తామని అన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఇప్పటికే నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉన్న తాగునీటి సరఫరాను పురపాలక శాఖకు బదలాయింపునకు నిర్ణయించామని తెలిపారు. విద్యుదీకరణ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయన్నారు. కూరగాయలు, మాంసం మార్కెట్లకు అనువైన స్థలాన్ని గుర్తించి నిర్మించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వాకింగ్‌ ట్రాక్‌లు, హిల్‌కాలనీ, పైలాన్‌ కాలనీల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వీధిలైట్ల ఏర్పాటులో నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. అంతకుముందు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 27లక్షల చేప పిల్లలను వదిలారు. కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, ఎంపీపీలు అనురాధ, భగవాన్‌నాయక్‌, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్‌ రామ్‌చందర్‌నాయక్‌, తాసీల్దార్‌ సైదులుగౌడ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కర్న బ్రహ్మానందరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయ్‌భాస్కర్‌, కౌన్సిలర్లు ఇర్ల రామకృష్ణ, నిమ్మల ఇందిర, నంద్యాల శ్వేత, నాగరాణి, నాగశిరీష, రమేశ్‌జీ, మంగ్తా, పైలాన్‌ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు అప్పారావు, కార్యదర్శి శ్రీను, ఎన్నెస్పీ అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo